టార్గెట్ రూ.175 కోట్లు
ABN, Publish Date - May 18 , 2025 | 01:37 AM
ప్రైవేటు మద్యం పాలసీలో లైసెన్స్‌దారులకు ఎక్సైజ్ శాఖ లక్ష్యాలను నిర్దేశిస్తోంది. ఈ నెలలో జిల్లాలో రూ.175 కోట్ల అమ్మకాలు సాగించాలని స్పష్టం చేసింది.
ఈ నెలలో లైసెన్స్ ఫీజు, సరుకు కొనుగోలుకు లైసెన్స్‌దారుల ఆపసోపాలు
అమ్మినా, అమ్మకపోయినా మద్యం కొనాల్సిందే.. ఎక్సైజ్ ఆదేశాలు
ఇప్పటికే నెలకు రూ.120 కోట్ల విక్రయాలు.. ఇప్పుడు మరో రూ.55 కోట్లు పెంచాలి
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
ప్రైవేటు మద్యం పాలసీలో లైసెన్స్‌దారులకు ఎక్సైజ్ శాఖ లక్ష్యాలను నిర్దేశిస్తోంది. ఈ నెలలో జిల్లాలో రూ.175 కోట్ల అమ్మకాలు సాగించాలని స్పష్టం చేసింది. మద్యం షాపులు, బార్ లైసెన్స్ దారులు ఈ నెల 31 నాటికి లక్ష్యాన్ని పూర్తి చేయాలి. ఇదే నెలలో లైసెన్స్ రుసుము చెల్లించాలి. ఒకేసారి రెండు దెబ్బలు. అప్పుల కోసం లైసెన్స్‌దారులు పరు గులు పెడుతున్నారు. గతంలో మద్యం షాపు యజ మానులంటే మార్కెట్‌లో అప్పు పుట్టేది. ఇప్పుడు మార్కెట్‌లో అప్పు దొరకడం లేదు. లక్ష్యానికి మించి మద్యం కేసులు కొనుగోలు చేయాల్సి రావడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. జిల్లాలో ప్రతి నెలా రూ.120 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరు గుతున్నాయి. గతంలో అమ్మకాలు సాగించిన నాసి రకం మద్యానికి స్వస్తి పలికారు. బ్రాండెడ్ రకాలే అందుబాటులోకి వచ్చాయి. అక్రమమార్గంలో దిగు మతి చేసి విక్రయించే విధానానికి చెక్ పడింది. బ్రాండెడ్ రకాల పేరుతో తయారు చేస్తూ జిల్లాకు దిగుమతి చేస్తున్న నకిలీ మద్యం రాకెట్‌ను ఎక్సైజ్ శాఖ కుప్పకూల్చింది. నిందితులను అరెస్ట్ చేశారు. ఇలా ఎక్కడికక్కడ కట్టడి చేయడంతో జిల్లాలో మ ద్యం అమ్మకాలు పెరిగాయి. గతంలో రూ.3 కోట్లు టర్నోవర్ సాధించేవారు. ఇప్పుడది రూ.4 కోట్లకు చేరింది. నెలకు రూ.120 కోట్ల మేర అమ్మకాలు సాగి స్తున్నారు. అయితే మేలో రూ.175 కోట్లు లక్ష్యాన్ని సాధించాలని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీచేశారు. దీంతో లైసెన్స్‌దారులు మల్లగుల్లాలు పడుతున్నారు. లక్ష్యానికి మించి కొనుగోలు చేసేందుకు ఆపసోపాలు పడుతున్నారు.
బార్‌ల కొత్త ఎత్తుగడ
మద్యం షాపుల్లో నాణ్యమైన బ్రాండ్‌లు లభ్యం కావడంతో బార్‌లలో వినియోగం పడిపోయింది. అధిక ధరలకు బార్‌లలో మద్యం విక్రయిస్తారు. కానీ మద్యం షాపుల్లో ఎంఆర్‌పీ ధరకంటే తక్కువకు సరఫరా చేస్తుండడంతో బార్‌ల వైపు ఎవరూ పెద్దగా చూడడం లేదు. వైసీపీ హయాంలో ప్రభుత్వషాపుల్లో నాసిరకం ఉండేది. బార్‌లలోనే బ్రాండ్‌లు దొరికేవి. దాంతో మద్యపానప్రియులు బార్‌లకు ఎగబడేవారు. అప్పట్లో బార్‌ల వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఉండేది. ప్రస్తుతం ప్రైవేటు షాపుల్లోనూ బ్రాండెడ్ రకాలు దొరకుతున్నాయి. పైగా తక్కువ ధరకే లభ్యమవుతోంది. దాంతో బార్‌లలో అమ్మకాలు పడిపోయాయి. భీమవరం, తాడేపల్లిగూడెంలో రెండు షాపుల్లో ప్రతిరోజు రూ.2 లక్షలకు పైగా అమ్మకాలు సాగించేవారు. ప్రైవేటు మద్యం షాపులు వచ్చిన తర్వాత అమ్మకాలు రూ.15 వేలకు పడిపో యాయి. దీంతో అక్కడ ఎంఆర్‌పీ ధరలకే అమ్మ కాలు సాగించే ఎత్తుగడ వేశారు. ఫలితంగా రోజుకు లక్ష రూపాయల వంతున బార్‌లలోనూ అమ్మకాలు సాగిస్తున్నారు. ఇలాంటి ఎత్తుగడలు వేసుకుంటూ బార్‌లు నిర్వహిస్తున్నారు. అయినా నష్టాల బాటలోనే నడుస్తున్నాయి. ఈ తరుణంలో లక్ష్యాలు ఇవ్వడంతో బార్‌ల యజమానులు సైతం దిక్కులు చూస్తున్నారు.
Updated Date - May 18 , 2025 | 01:37 AM