ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: మెగా పీటీఎం రోజునే.. రెండో విడత తల్లికి వందనం!

ABN, Publish Date - Jul 08 , 2025 | 12:36 AM

సూపర్‌సిక్స్‌ హామీల్లో ఒకటైన తల్లికి వందనం ఆర్థిక సాయానికి రెండో విడత లబ్ధిదారుల ఎంపికకు కసరత్తును ముమ్మరం చేశారు.

నేడో, రేపో అర్హుల జాబితాలు

ఏలూరు అర్బన్‌, జూలై7(ఆంధ్రజ్యోతి): సూపర్‌సిక్స్‌ హామీల్లో ఒకటైన తల్లికి వందనం ఆర్థిక సాయానికి రెండో విడత లబ్ధిదారుల ఎంపికకు కసరత్తును ముమ్మరం చేశారు. ఈనెల 10న అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో నిర్వహించనున్న మెగా పేరెంట్స్‌, టీచర్స్‌ మీట్‌ (పీటీఎం) రోజున జిల్లాలో అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాలకు ఆర్థికసాయం రూ.13వేలు చొప్పున జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. తొలివిడతలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో రెండోతరగతి నుంచి పదోతరగతి వరకు, జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ ద్వితీ య సంవత్సరం చదువుతున్న మొత్తం 2,15, 082మంది బాలబాలికల నుంచి ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జిల్లాలో మొత్తం 1,40, 764 మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు నగ దు జమ చేసిన విషయం విదితమే. తాజాగా ప్రస్తుత విద్యాసంవత్సరం (2025–26)లో కొత్తగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఈనెల 5వ తేదీ వరకు ఒకటో తరగతి అడ్మిషన్లు తీసుకున్న 22,233 మంది, జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశాలు పొందిన 16,757 మంది విద్యార్థులకు తల్లికి వందనం ఆర్థిక సాయాన్ని అందజేసేందుకు ప్రభుత్వ నిబం ధనల మేరకు అర్హులను ఎంపిక చేయడానికి కసరత్తు, వడపోత ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ క్రమంలో జిల్లాలో ఒకటో తరగతి లో చేరిన బాలబాలికల్లో 4,156 మందికి సంబంధించిన వివరాల్లో తప్పులు దొర్లడంతో వాటిని మంగళవారం ఉదయంలోగా హెచ్‌ ఎంల లాగిన్‌లలో సరిచేసి పంపాలని పాఠ శాల విద్యాశాఖ సోమవారం ఆదేశాలు పం పింది. మొత్తంమీద మంగళ, బుధవారాల్లో అర్హులైన తల్లుల ఎంపిక జాబితాలను విడు దల చేస్తారని విద్యాశాఖవర్గాలు వివరించా యి. పాఠశాలలకు సంబంధించి అర్హులైన తల్లుల జాబితాలను నేరుగా టీచర్ల లీప్‌ యాప్‌లో పొందుపరుస్తారని తెలిపాయి.

10న ఆర్థికసాయం అందజేత సోషల్‌ వెల్ఫేర్‌ జేడీ

ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు ఈనెల 10న తల్లికి వందనం ఆర్థికసాయాన్ని బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నట్టు జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారత అధికారి విశ్వమోహన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.విద్యార్థి పేరున వున్న బ్యాంకు ఖాతాకు, ఆధార్‌ నంబరుకు ఎన్‌ పీసీఐ లింక్‌ చేయించుకోవాలని సూచించా రు. ఖాతాలేని విద్యార్థులు తప్పనిసరిగా బ్యాంకు ఖాతా లేదా పోస్టాఫీసు బ్యాంకు ఖాతాను తెరిచి ఆధార్‌ నంబరుకు ఎన్‌పీసీఐ లింక్‌ చేయించుకోవాలన్నారు.

Updated Date - Jul 08 , 2025 | 06:55 AM