తల్లికి వందనం వర్తిస్తుందా..!
ABN, Publish Date - Jun 22 , 2025 | 12:46 AM
తల్లికి వందనం పథకాన్ని రాష్ట్రం ప్రభు త్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. ఒక ఇంట్లో ఇద్దరు లేదా ఇంకా ఎందరు న్నా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు.
కరెంటు బిల్లులు, వాహనాలు , భూముల సమస్యలే ప్రధానం
వాస్తవానికి పథకానికి అర్హులుగా లక్షా 55 వేల మంది గుర్తింపు
వివిధ కారణాలతో 60 వేల మంది అనర్హుల జాబితాలోకి..
ఏలూరుసిటీ, జూన్ 21(ఆంధ్రజ్యోతి): తల్లికి వందనం పథకాన్ని రాష్ట్రం ప్రభు త్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. ఒక ఇంట్లో ఇద్దరు లేదా ఇంకా ఎందరు న్నా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. అయితే పథకానికి అర్హులైనప్పటికీ కొం దరికి అందని పరిస్థితులు ఏర్పడ్డాయి. కరెంటు బిల్లు 300 యూనిట్లు కన్నా ఎక్కువ వచ్చిందని, నాలుగు చక్రాల వాహనం ఉందని, నిబంధనల కన్నా అధికంగా భూములు ఉన్నాయన్న కార ణాలతో కొంతమంది అర్హులు అనర్హుల జాబితాలోకి వచ్చారు. అయితే అర్హులైన వారు ఆ అభ్యంతరాలకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలు సచివాలయాల్లో అందజేయాలని, దీనికి ఈనెల 20వతేదీ వరకు గడువు విధించారు. అర్హులైన వారు విద్యుత్‌కు సంబంధించి మండ లాల్లో విద్యుత్ ఏఈ వద్ద సరాసరి విద్యుత్ వినియోగానికి సంబంధించి ధ్రువీకరణ పత్రాలను పొంది వాటిని సచివాలయాలకు గడువు లోగానే సచి వాలయాలకు అందించారు.అలాగే తమకు నాలుగు చక్రాల వాహనం లేదని సంబంధిత అధికారుల వద్ద ధ్రువీకరణ పత్రాలను తీసుకొచ్చి సచివా లయాలకు అందజేశారు. అయితే ప్రభుత్వం వద్ద ఉన్న రవాణా శాఖ లాగిన్‌లో ఇంకా పాత పేర్లు ఉండడంతో వాహనం అమ్మివేసినా కొంతమంది అర్హులకు ఆ పేరు మీద వాహనం ఉన్నట్లు చూపిస్తోందని, తనకు కారు లేదని రవాణా శాఖాధికారులు పత్రం ఇచ్చినా రాష్ట్ర స్థాయిలోని రవాణా వెబ్‌సైట్‌లో కారు ఉన్నట్లుగానే చూపి స్తోందని కొంతమంది అర్హులైన పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు. భూము లకు సంబంధించి జాయింట్ కుటుంబా లలో నిబంధనలు కన్నా ఎక్కువ భూ ములు చూపిస్తుండటంతో సంబంధిత అర్హులైన లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. తమ అర్హతలకు సంబంఽఽఽఽఽధించి ధ్రువీకరణ పత్రాలను గ్రామ/వార్డు సచివాలయాలకు అందించామని, అయితే తాము చేసిన అభ్యంతరాలు పరిష్కారమవుతాయా లేదో అన్న ఆందోళనలో వారంతా ఉన్నారు. జిల్లాలో మొత్తం ఈ పథకాని కి సంబంధించి లక్షా 55 వేలుకు పైగా అర్హులుగా గుర్తించగా, ఈ పథకానికి 60 వేల మంది వరకు వివిధ కారణా లతో అనర్హుల జాబితాలోకి వచ్చారు. వీరిలో అర్హులైన వారందరూ తమ అర్హ తలకు సంబంధించి, సంబంఽధిత అధికా రులతో ధ్రువీకరణ పత్రాలను అందించా రు. గ్రామ/వార్డు సచివాలయాల్లో వచ్చి న అభ్యంతరాలను త్వరితగతిన పరిష్క రించి అర్హులైన వారికి ఈ పథకాన్ని అందజేయాలని వారు కోరుతున్నారు.
ఉన్నది 70 సెంట్ల భూమి..
15 ఎకరాలుగా నమోదు
పెదవేగి, జూన్ 21(ఆంధ్రజ్యోతి):‘నాకు ముగ్గురు కుమా ర్తెలు. 5, 7, 9 తరగ తులు చదువుతున్నారు. తల్లికి వందనం పథకం కింద రూ.39వేలు వస్తాయని ఆశించా. కానీ నా పిల్లలు ఒక్కరికి కూడా సొమ్ము జమకాలేదు. ఇదేమని అడిగితే నీకు 15 ఎకరాలు భూమి ఉందని చెప్పారు. నాకున్నది కేవలం 70 సెంట్ల భూమి మాత్రమే. భార్యాభర్తలిద్దరం కూలి పనులకెళ్తూ పిల్లలను చదివించుకుంటున్నాం. దయచేసి, మాకు తల్లికి వందనం పఽథకం సొమ్ము ఇప్పించండి’.. అంటూ ఓ పేద తండ్రి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దగ్గరకు శనివారం తన కుమార్తెలతో సహా వచ్చి వేడుకున్నాడు. అమ్మపాలేంకు చెందిన మరీదు ఏడుకొండలుకు ముగ్గురు కుమార్తెలు. వారంతా ప్రభుత్వ పాఠశాల ల్లోనే చదువుతున్నారు. అతని ఆధార్ కార్డు నంబర్‌ను ఆన్‌లైన్ పరిశీలిస్తే వారి కుటుంబానికి 15 ఎకరాల భూమి ఉందని చూపిస్తోంది. దీంతో తల్లికి వందనం సొమ్ము రాలేదు. దీంతో ఆ కుటుంబం ఎమ్మెల్యే చింతమనేనిని కలిశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే పొర పాటు ఎక్కడ జరిగిందో తెలుసుకుని సరిచేసి, తల్లికి వందనం సొమ్ము ఆ కుటుంబానికి అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
Updated Date - Jun 22 , 2025 | 12:46 AM