సమ్మర్ స్పెషల్స్ జాడేది..
ABN, Publish Date - Apr 21 , 2025 | 12:10 AM
వేసవి వచ్చిందంటే రైళ్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. అందులోనూ ఏసీ కోచ్‌లకు ఖాళీ ఉండదు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులంతా ఏసీ టిక్కెట్లకు ఎగబడతారు.
ఇప్పటికే రైళ్లన్నీ ఫుల్.. తిరుపతి, షిర్డీ రైళ్లకు డిమాండ్
ప్రత్యేక రైళ్ల కోసం ప్రయాణికులు ఎదురుచూపు
నరసాపురం, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): వేసవి వచ్చిందంటే రైళ్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. అందులోనూ ఏసీ కోచ్‌లకు ఖాళీ ఉండదు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులంతా ఏసీ టిక్కెట్లకు ఎగబడతారు. అయితే ఈసారి ప్రధాన రైళ్లకు ముందు సమ్మర్ డిమాండ్ తాకింది. జిల్లా మీదుగా వెళ్లే షిర్డీ, తిరుపతి, బెంగళూరు, హైద్రాబాద్ వంటి రైళ్లు నిండుకున్నాయి. ప్రయాణికులంతా స్పెషల్ రైళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే రైల్వే ఇంతవరకు వాటి ఊసే ఎత్తడం లేదు. నామమాత్రంగా నరసాపురం నుంచి బెంగ ళూరు మీదుగా ఒక ప్రత్యేక రైలు వేసి చేతులు దులుపుకుంది. డిమాండ్ ఉన్న తిరుపతి, నాగర్‌సోల్ వంటి రూట్లలో ఎటువంటి రైళ్లను నడపడం లేదు.
దీంతో యాత్రలకు వెళదామని ప్లాన్ చేసుకున్న ప్రయాణికులు తాత్కాలిక టిక్కెట్లపై ఆధారపడాల్సి వచ్చింది. ప్రస్తుతం నరసాపురం నుంచి షిర్డీకి నాగల్‌సోల్ ఎక్స్‌ప్రెస్ నడుస్తుంది. దీనికి నెలల ముందుగానే టిక్కెట్లు నిండుకుంటాయి. వేసవి వచ్చిదంటే ఈ రైలుకు ఫుల్ డిమాండ్. జిల్లా నుంచే కాకుండా ఉమ్మడి కృష్ణా, ప్రకాశం, గుంటూరు కోనసీమ జిల్లా ప్రజలు కూడా ఈ రైలునే ఆశ్రయిస్తారు. ప్రస్తుతం 23 కోచ్‌లతో నడుస్తున్న ఈ రైలు వేసవికి ఫుల్ అయిపోయింది. దీంతో షిర్డీ వెళ్లే ప్రయాణికులు స్పెషల్ రైళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. కనీసం నెలలో ఒక్క రైలైనా నడిపితే సగం డిమాండ్ తగ్గే ఛాన్స్ ఉంది. ఇక తిరుపతికి ఇదే డిమాండ్. సాధారణంగా చాలామంది వేసవి సెలవుల్లో తిరుపతి వెళ్లి మొక్కులు తీర్చుకుంటారు. దానికి ఆను గుణంగా దర్శనం టిక్కెట్ల కూడా బుక్ చేసుకుంటారు.
ప్రస్తుతం జిల్లా నుంచి రెండు రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. అందులో ఒకటి నరసాపురం నుంచి వెళ్లుతుంటే..మరొకటి కాకినాడ నుంచి బెంగళూరుకు తిరుపతి మీదుగా వెళ్లే శేషాద్రి ఒకటి. ఈ రైలులో ఎక్కువుగా బెంగళూరు వెళ్లే ప్రయాణికులే ఉంటారు. ఇది కాకినాడ, రాజమండ్రి మీదుగా వస్తుండటంతో పైస్టేషన్లలోనే ఫుల్ అయి పోతుంటుంది. దీంతో జిల్లా ప్రయాణికులు నరసాపురం నుంచి వెళ్లే ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌నే ఆశ్రయిస్తారు. అయితే ఈ రైలుకు ఎప్పుడూ ఫుల్ డిమాండ్ ఉంటుంది. తిరుపతి వెళ్లే ప్రయాణికులే కాకుండా ఆరుణాచలం, తమిళనాడు వెళ్లేవారు కూడా ఎక్కువుగా ఈరైలులోనే వెళుతుంటారు. దీంతో రద్దీ ఎక్కువుగా ఉంటుంది. ప్రస్తుతం జూన్ వరకు టిక్కెట్లు దొరకని పరిస్థితి.
రద్దీకి అనుగుణంగా స్పెషల్ రైళ్లు నడిపితే ప్రయాణికుల కష్టాలు తీరుతాయి. ఇక హైద్రాబాద్, బెంగ ళూరు వెళ్లే రైళ్లు కూడా వేసవి రద్దీ తాకింది. గతంలో హైద్రాబాద్‌కు ఆదివారం రోజుల్లో రెగ్యులర్ రైళ్లు కాకుండా రెండు స్పెషల్ రైళ్లు నడిపేవారు. ప్రస్తుతం ఒకటే నడుస్తుంది. మరో స్పెషల్ నడిపితే ఈ రూట్‌లో కొంత మేర ప్రయాణికుల కష్టాలు తీరుతాయి. అయితే ప్రస్తుతం సికింద్రాబాద్ స్టేషన్‌లో పనులు జరుగుతున్నందున రెగ్యులర్‌గా నడిచే రైళ్ల రూట్లనే మారుస్తున్నారు. ఈ కారణంగా గతంలో మాదిరిగా స్పెషల్ రైళ్లను హైద్రాబాద్ మీదుగా ఈ వేసవిలో నడపడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
China Warning: మా ప్రయోజనాలపై దాడి చేస్తే ఊరుకోం..అమెరికాకు చైనాహెచ్చరిక
Elon Musk: తల్లి బర్త్ డేకు సర్‌ప్రైజ్ చేసిన ఎలాన్ మస్క్..ఎలాగో తెలుసా..
Gold Rates Today: ఈరోజు గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయంటే..ఈ వారం లక్షకు చేరుతుందా..
Updated Date - Apr 21 , 2025 | 11:24 AM