ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భూచోళ్లు!

ABN, Publish Date - May 07 , 2025 | 12:43 AM

‘భూమి నా కళ్ల ముందే వుంది. దీని డాక్యుమెంట్లు మా ఇంటి బీరువా లాకర్‌లో భద్రంగానే ఉన్నాయి’ అని ధీమాగా ఉన్నారా ? అయితే మీరు పొరబడినట్లే..! మీకు తెలియకుండా మీ భూమిని.. మీ డాక్యుమెంట్ల జిరాక్స్‌ కాపీలతో లీజుకు తీసుకున్నట్లు అగ్రిమెంట్లు సృష్టించే మహా మాయగాళ్లు మీ చుట్టూనే ఉన్నారు.

ఇటు రైతులు, అటు బ్యాంకులను బురిడీ కొట్టించే మాయగాళ్లు

మొన్న మచిలీపట్నం.. మొగల్తూరు.. నిన్న నరసాపురంలో వెలుగులోకి

తాజా ఘటనతో రైతుల ఉలికిపాటు.. సెంట్రల్‌ బ్యాంకులో అధికారుల విచారణ

‘భూమి నా కళ్ల ముందే వుంది. దీని డాక్యుమెంట్లు మా ఇంటి బీరువా లాకర్‌లో భద్రంగానే ఉన్నాయి’ అని ధీమాగా ఉన్నారా ? అయితే మీరు పొరబడినట్లే..! మీకు తెలియకుండా మీ భూమిని.. మీ డాక్యుమెంట్ల జిరాక్స్‌ కాపీలతో లీజుకు తీసుకున్నట్లు అగ్రిమెంట్లు సృష్టించే మహా మాయగాళ్లు మీ చుట్టూనే ఉన్నారు. కాబట్టి రైతులందరూ తస్మాత్‌ జాగ్రత్త. ఒకసారి మీ భూమిపై ఏమైనా బ్యాంకుల్లో రుణాలు ఉన్నాయేమో తెలుసుకోండి. ఎందుకంటే నిన్న నరసాపురంలో భూ యజమానికి తెలియకుండా.. భూములకు లీజు అగ్రిమెంట్‌ సృష్టించి నాలుగు కోట్లు రుణం తీసుకున్నారు.

రెండేళ్ల క్రితం కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన ఓ రైతు రుణం కోసం బ్యాంకుకు వెళ్లాడు. సర్వే నెంబర్లను కంప్యూటర్‌లో పరిశీలించిన అధికారులు భూమిపై రుణం ఉందని చెప్పడంతో ఆ రైతు షాక్‌ తిన్నాడు. వెంటనే పరిసర ప్రాంతాల రైతులు తమ భూములను ఎవరైనా బ్యాంకుల్లో పెట్టి రుణం తీసుకున్నారేమోనన్న భయంతో చెక్‌ చేసుకున్నారు. చూస్తే వంద ఎకరాలకుపైగా రైతులకు తెలియకుండా లీజు చేస్తున్నట్లు చూపించి, కొందరు కేటుగాళ్లు బ్యాంకుల్లో పెట్టి రుణం కొట్టేశారు. పోలీసులు విచారించగా.. ఈ మోసం వెనుక జిల్లాలో ఓ ముఖ్య వ్యక్తి పాత్ర ఉన్నట్లు తేలింది.

అదే ఏడాది మొగల్తూరుకు చెందిన కొందరు రైతులకు రుణం కట్టాలంటూ బ్యాంకుల నుంచి నోటీసులు వచ్చాయి. తాము తీసుకోని రుణానికి డబ్బులు చెల్లించడమే మిటని రైతులు షాక్‌ తిన్నారు. విచారిస్తే.. మొగల్తూరు, కాళీపట్నంకు చెందిన రైతుల భూములను వారికి తెలియకుండా లీజు డాక్యుమెంట్లు సృష్టించి గణపవరం బ్యాంకులో రుణం తీసుకున్నారు. చివరికి ఈ కేసును సీబీసీఐడీ విచారణలో ఇంకా కొనసాగుతూనే వుంది.

(నరసాపురం–ఆంధ్రజ్యోతి):

నరసాపురం సెంట్రల్‌ బ్యాంకులోను ఇదే తరహా మోసం తాజాగా వెలుగుచూసింది. అయితే ఇక్కడ రుణం తీసుకున్న వ్యక్తికి లీజు గురించి తెలియదు. తన ఆస్తులను తాకట్టు పెట్టి లోన్‌ తీసుకున్నాడు. ఇందులో కీలకపాత్ర పోషించింది పట్టణానికి చెందిన ఒక బ్రోకర్‌ అని తేలింది. కేవలం తక్కువ వడ్డీకి రుణం దక్కుతుందని ఆశ పడి బ్రోకర్‌ చెప్పిన మాట నమ్మడం వల్ల అల్లరిపాలు కావాల్సి వచ్చింది.

నేడు ఊరూరా బ్రోకర్లు

గతంలో పెళ్లిళ్లు... రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లోనే బ్రోకర్లను చూసేవాళ్లం. నేడు ప్రజల అవసరాలను గుర్తించి కొందరు కేటుగాళ్లు బ్యాంకు బ్రోకర్ల అవతారం ఎత్తారు. బహిరంగంగానే కన్సల్టెంట్స్‌ బోర్డులు పెట్టుకుని బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తామని అమాయక ప్రజలను ఊబిలోకి దించుతున్నారు. కొందరు బ్యాంకు మేనేజర్లను మచ్చిక చేసుకుని వారి ద్వారా లక్షలు, కోట్ల రూపాయల రుణాన్ని ఇప్పిస్తున్నారు. ఇందులో కొందరు నిజాయితీగా చేస్తుంటే.. మరికొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. కేవలం ‘మీ ఆస్తుల్ని తాకట్టు పెట్టండి.. మీకు ఇంత పెద్ద మొత్తంలో రుణం ఇప్పిస్తా’మని బురిడీ కొట్టిస్తున్నారు. రుణం సక్రమంగా చెల్లిస్తే.. అంతా ఓకే. లేకపోతే అందులోని లోపాలు బయటకు పొక్కి అల్లరిపాలు కావాల్సిందే. ఇటు రైతులకు తెలిసినా... సీన్‌ రివర్స్‌ అవుతుంది.

ఆ వివరాలు ఎలా తెలుస్తున్నాయి ?

రైతులు చెరువులు తవ్వే సమయంలో భూములకు సంబంధించిన దస్తావేజులను జిరాక్స్‌ తీసి వీఆర్వో ద్వారా మత్స్యశాఖకు అందిస్తుంటారు. లేదా కొన్ని సమయాల్లో దస్తావేజుల నకళ్లను వీఆర్వో, మీసేవలకు ఇస్తుంటారు. కొందరు రుణం ఇప్పిస్తామని రైతుల నుంచి జిరాక్స్‌ కాపీలను తీసుకుంటారు. ఇదే సమయంలో ఆధార్‌కార్డు, పాస్‌బుక్‌ జిరాక్స్‌లను నకలు కాపీలు ఇవ్వడం సర్వ సాధారణం. ఇచ్చింది జిరాక్స్‌ కాపీలేనన్న ధీమాతో చాలా మంది పట్టించుకోవడం లేదు. ఇక్కడే మోసానికి తెరలేస్తోంది. కేటుగాళ్లు వీటిని సంపాధించి రుణం లీజు అగ్రిమెంట్లు సృష్టిస్తున్నారు. బ్యాంకుల్లో వెలుగు చూస్తున్న మోసాలన్నీ ఇలా బయటకు వచ్చినవే.

తస్మాత్‌ జాగ్రత్త..

భూమే కదా ఎక్కడికి పోతుంది ? ఓరిజనల్‌ డాక్యుమెంట్స్‌ అన్నీ బీరువాలోనో, సొసైటీలోనో ఉన్నా యి కదా అన్న ధీమాతో ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో బోల్తా కొట్టినట్లే! ఇళ్లు, పొలాల దస్తావేజులను బ్యాంకు లో పెట్టి రుణం తీసుకోకపోతే వాటిని తరచూ చెక్‌ చేసుకోవాలి. లేకుంటే కేటుగాళ్లు మనకు తెలియ కుం డానే వాటిని బ్యాంకుల్లో పెట్టి రుణం కొట్టేస్తున్నారు.

కొనసాగుతున్న విచారణ

నరసాపురం సెంట్రల్‌ బ్యాంకులో వెలుగుచూసిన రూ.4 కోట్ల స్కామ్‌ తీరప్రాంత రైతులనే కాదు. జిల్లాలోని అందరినీ ఉలికిపాటుకు గురిచేసింది. రుణం తీసుకున్న కూనపరెడ్డి ప్రసాద్‌, దుడే చంద్రశేఖర్‌ ఇద్దరూ వారి ఆస్తుల డాక్యుమెంట్లను బ్యాంకులో తాకట్టు పెట్టారు. అయితే వీరికి లోన్‌ ఇప్పించిన బ్రో కర్‌ మాత్రం ఆక్వా సాగు రుణం తీసుకుంటే తక్కువ వడ్డీ పడుతుందని వీరిని మభ్యపెట్టాడు. పొలాలు లేకపోయినా.. వీరి పేరున లీజు అగ్రిమెంట్లు సృష్టించి కోట్ల రుణం ఇప్పించాడు. ఇందుకు పెద్ద ఎత్తున కమీషన్లు దండుకున్నారన్న వాదనలు లేకపోలేదు. ఇందులో బ్యాంకు అధికారుల పాత్రపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై బ్యాంకు ఉన్నతాధికారులు ప్రాథమిక విచారణకు ఆదేశించారు. సెంట్రల్‌ బ్యాంకు విజయవాడ పరిధిలోని చీఫ్‌ మేనేజర్‌ వినోద్‌, ఇద్దరు సీనియర్‌ మేనేజర్లు ఎం.రావు, నర్సింహాలను బ్యాంకు రీజనల్‌ మేనేజర్‌ ప్రాఽథమిక విచారణకు నియ మించారు. వీరు మంగళవారం బ్యాంకు రికార్డులను పరిశీలించి, వివరాలు నమోదు చేసుకున్నారు. అయితే వివరాలు చెప్పేందుకు నిరాకరించారు.

Updated Date - May 07 , 2025 | 12:43 AM