సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించండి : జాయింట్ కలెక్టర్
ABN, Publish Date - May 27 , 2025 | 12:27 AM
ప్రజా సమస్యలపై వచ్చిన అర్జీలపై క్షేత్రస్థాయిలో వారి ఇంటికి వెళ్లి స్వయంగా పరిశీలించి పరిష్కారం చూపితే అధికారులపై గౌరవం పెరుగుతుందని జేసీ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు.
భీమవరం టౌన్, మే 26 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలపై వచ్చిన అర్జీలపై క్షేత్రస్థాయిలో వారి ఇంటికి వెళ్లి స్వయంగా పరిశీలించి పరిష్కారం చూపితే అధికారులపై గౌరవం పెరుగుతుందని జేసీ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో సోమవారం ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అర్జీలను సమర్థవంతంగా పరిష్కరించడానికి సంబంధిత అధికారులు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలన్నారు. వివిధ శాఖలకు సంబం ధించి మొత్తం 192 అర్జీలు అందాయి. కార్యక్రమంలో డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పీడీ కేసీహెచ్.అప్పారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జడ్డు వెంకటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు
పోలీసు శాఖకు 11 అర్జీలు స్వీకరణ
భీమవరం క్రైం: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అర్జీలను స్వీకరించారు. అర్జీదారులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, తల్లిదండ్రులు వేధింపులు, భర్త, అత్తారింటి వేధింపులు, భూ ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్‌లైన్ మోసం, ప్రేమపేరుతో మోసం, ఇతర సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సంబంధిత పోలీసు అధికారులతో ఎస్పీ ఫోన్‌లో మాట్లాడి చట్టపరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మొత్తం 11 ఫిర్యాదులు స్వీకరించారు. ఏఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 27 , 2025 | 12:30 AM