సహకారం పారదర్శకం
ABN, Publish Date - May 22 , 2025 | 12:13 AM
ప్రాథమిక సహకార సంఘాల్లో మరింత పారదర్శకత కోసం పశ్చిమ గోదావరి జిల్లాలోని 122 సొసైటీలను ఆన్‌లైన్ చేస్తున్నారు. ఇప్పటికే 117 సంఘాలు కంప్యూటరీక రణ జరిగిన ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి రాగా, టెక్నికల్ సమస్య కారణంగా మరో ఐదు సంఘాలు రోజుల వ్యవధిలోనే ఆన్‌లైన్‌లోకి రాను న్నాయి.
సొసైటీల్లో ఆన్‌లైన్ సేవలు ప్రారంభం
ఇక నుంచి బ్యాంకింగ్ మాదిరి లావాదేవీలు
ఎక్కడి నుంచైనా నిర్వహించుకునే అవకాశం
అక్రమాలకు ఇక చెక్ పడినట్టే..! రైతుల్లో హర్షాతిరేకాలు
తాడేపల్లిగూడెం రూరల్, మే 21(ఆంధ్రజ్యోతి):ప్రాథమిక సహకార సంఘాల్లో మరింత పారదర్శకత కోసం పశ్చిమ గోదావరి జిల్లాలోని 122 సొసైటీలను ఆన్‌లైన్ చేస్తున్నారు. ఇప్పటికే 117 సంఘాలు కంప్యూటరీక రణ జరిగిన ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి రాగా, టెక్నికల్ సమస్య కారణంగా మరో ఐదు సంఘాలు రోజుల వ్యవధిలోనే ఆన్‌లైన్‌లోకి రాను న్నాయి. ఆన్‌లైన్ కావడంతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎందుకం టే రైతులకు వెన్నుదన్నుగా నిలవాల్సిన ఈ సొసైటీల్లో లెక్కలేనన్ని అవక తవకలు జరిగాయి. ఈ ఆన్‌లైన్ విధానం ద్వారా సహకార సంఘాలు పారదర్శకంగా మారనున్నాయి. రైతుల సంక్షేమం కోసం ఏర్పాటైన ఈ సొసైటీల్లోని సొమ్మును కొందరు సొంతానికి వాడుకునేవారు. ఇప్పటికే పదుల సంఖ్యలో సొసైటీలు కార్యవర్గాలు, అధికారుల మోసాలకు కుదేల య్యాయి. రైతుల్లో వీటిపై నమ్మకం సడులుతూ వచ్చింది. గత ప్రభుత్వ చర్యలు వీటిని నీరుగార్చే విధంగా వ్యవహరించడం, అవినీతి ఆరోపణలు పెరగడం మరింత భయాందోళనలు పెరిగాయి. చివరికి రైతులకు చెల్లిం చాల్సిన సంచుల సొమ్ములను దోచుకున్నారనే ఆరోపణలు రావడం వాటికి మరింత ఊతమిచ్చింది. వాటికి చెక్ పెట్టి సొసైటీలను బలోపేతం చేసే విధంగా ప్రభుత్వం ప్రాథమిక సహకార సంఘాలను ఆన్‌లైన్ చేసేందుకు చొరవ చూపడంతో వాటికి సమాధానం వెతికింది. ప్రస్తుతం ఆన్‌లైన్ విధా నం ద్వారా సాధారణ బ్యాంకింగ్ సేవల మాదిరి సొసైటీల లావాదేవీలు జరిగే అవకాశం ఉండటంతో రైతులకు భయం వదిలి అభయం వచ్చి నట్టవుతుంది. మిగిలిన జిల్లాలో కంప్యూటరీకరణకు ఏజెన్సీలకు అప్పగించ గా, పశ్చిమలో మాత్రం సిబ్బందే ఆన్‌లైన్ చేశారు. సాంకేతిక సమస్య కారణంగా ఏలేటిపాడు, యండగండి, ఉండి, నార్నిమెరక, కొత్తపాడు సొసైటీలు పెండింగ్ ఉన్నాయి. వీటిని త్వరలోనే పరిష్కరిస్తారు.
బ్యాంకింగ్‌కు సరితూగేలా
సహకార సంఘాలు ఇక నుంచి బ్యాంకుల మాదిరిగానే సేవలందించ నున్నాయి. కంప్యూటరీకరణ పూర్తయిన సొసైటీల నుంచి పారదర్శకంగా రైతుల ఖాతాలను ఎక్కడ నుంచైనా లావాదేవీలు నిర్వహించవచ్చు. చెల్లిం పులు, డిపాజిట్‌లు, రుణాలు, డివిడెంట్‌లు, తదితర లావాదేవీలు ఉన్నతా ధికారుల నుంచి రైతుల వరకూ నేరుగా చూసుకునే వీలుంది. ఇకపై అవకతవకలు చోటు ఉండదని అధికారులు భరోసా ఇస్తున్నారు.
Updated Date - May 22 , 2025 | 12:13 AM