స్లాట్ సక్సెస్
ABN, Publish Date - Apr 19 , 2025 | 12:54 AM
భూములు, ప్లాట్‌ల రిజిస్ర్టేషన్ల కోసం గంటలు, రోజుల తరబడి తిరిగే విధా నానికి స్లాట్ బుకింగ్ విధానంతో తెరపడిం ది. ఏలూరు జిల్లా రిజిస్ర్టార్ కార్యాలయం లో ఈనెల 4న ప్రయోగాత్మకంగా అమలు చేసిన స్లాట్ బుకింగ్ విధానం సక్సెస్ కావ డంతో కేవలం రెండు వారాల వ్యవధిలోనే జిల్లాలోని మిగిలిన 11 సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని ఈనెల 26 నుంచి అమలు చేయనున్నారు.
ప్రయోగాత్మకంగా జిల్లా రిజిస్ర్టార్ కార్యాలయంలో అమలు
319 రిజిస్ర్టేషన్లు.. రూ.2.53 కోట్లు ఆదాయం
26 నుంచి 11 సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లోను అమలు
ఇప్పటికే జిల్లా అంతటా అవగాహన కార్యక్రమాలు
(ఏలూరు–ఆంధ్రజ్యోతి) :
భూములు, ప్లాట్‌ల రిజిస్ర్టేషన్ల కోసం గంటలు, రోజుల తరబడి తిరిగే విధా నానికి స్లాట్ బుకింగ్ విధానంతో తెరపడిం ది. ఏలూరు జిల్లా రిజిస్ర్టార్ కార్యాలయం లో ఈనెల 4న ప్రయోగాత్మకంగా అమలు చేసిన స్లాట్ బుకింగ్ విధానం సక్సెస్ కావ డంతో కేవలం రెండు వారాల వ్యవధిలోనే జిల్లాలోని మిగిలిన 11 సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని ఈనెల 26 నుంచి అమలు చేయనున్నారు.
ఏలూరులోని జిల్లా రిజిస్ర్టార్ కార్యా లయంలో ఈనెల 4వ తేదీన ప్రయోగా త్మకంగా ప్రారంభించిన రోజునే 16 రిజి స్ర్టేషన్లు చేశారు. స్లాట్ బుకింగ్ విధానం లో సమయ పాలన పాటిస్తున్నారు. ఉద యం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల మధ్య రిజిస్ట్రేషన్లు చేయను న్నారు. అధికారుల గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు మొత్తం రెండు వారాల వ్యవధిలో జిల్లా రిజిస్ర్టార్ కార్యాలయంలో 319 డాక్యుమెంట్ల రిజిస్ర్టేషన్ల ద్వారా రూ. 2 కోట్ల 53 లక్షల 30 వేల ఆదాయం జమ అయ్యింది. ఈ విధానంలో దళారుల వ్యవస్థకు చెక్ పడింది. అన్ని రికార్డులు పారదర్శకంగా ఉంటే గంటలోనే రిజిస్ర్టేష న్లు పూర్తవుతుండటంతో కక్షిదారులకు రూ.వేలల్లోనే అదనపు ఖర్చులు మిగులు తున్నాయి.
రెండు వారాల వ్యవధిలోనే జిల్లా అంతటా అమలు
తాజాగా మిగిలిన 11 కేంద్రాలైన భీమడోలు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, కామవరపుకోట, పోలవరం, గణపవరం, వట్లూరు, కైకలూరు, మండవల్లి, ముదినే పల్లి, నూజివీడు రెండు వారాల వ్యవధిలో నే స్లాట్ బుకింగ్ విధానం అమలు చేయ నుండడంతో అక్కడ కక్షిదారుల కష్టాలు తీరినట్టే. కక్షిదారులు ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్ని డాక్యుమెంట్లు సిద్ధంగా ఉండి స్లాట్ బుక్ చేసుకుంటే రిజిస్ర్టేషన్లు పూర్తి చేసుకోవచ్చు. ఆస్తుల వివరాలు నమోదు చేసుకున్న తర్వాత ఐడీ వస్తుంది. దాని ఆధారంగా అనుకూల మైన సమయాన్ని నిర్ణయించుకోవచ్చు. అవగాహన లేకపోతే మీ సేవ కేంద్రం, దస్తావేజు లేఖరుల ద్వారా నమోదు చేసుకోవచ్చు. అనుకోని అనివార్య కార ణాలతో ఎంచుకున్న సమయంలో కక్షి దారులు రిజిస్ర్టేషన్ కోసం హాజరు కా లేకపోతే ఆందోళన చెందాల్సిన పనిలే దు. పాత ఐడీతోనే ఎప్పుడైనా చేసుకునే వెసులుబాటు కల్పించారు. అవసరమైన పత్రాలన్నీ సిద్ధం చేసుకుంటే ఆ సమ యానికి వచ్చి రిజిస్ర్టేషన్ చేసుకోవచ్చు. ఈ కొత్త విధానంపై జిల్లావ్యాప్తంగా సంబంధిత అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున కక్షిదారులకు అవగాహన కార్యక్ర మాలు నిర్వహించారు.
Updated Date - Apr 19 , 2025 | 12:54 AM