జిల్లా అంతటా స్లాట్ రిజిస్ర్టేషన్లు
ABN, Publish Date - Apr 27 , 2025 | 01:10 AM
భూము లు, ప్లాట్‌ల రిజిస్ర్టేషన్లు సులభతరంగా చేసేందుకు 11 సబ్ రిజిస్ర్టార్ కార్యాల యాల్లో శనివారం ప్రారం భమైన స్లాట్ బుకింగ్ విధానం విజయవంత మైంది.
కొత్తగా 11 సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో ప్రారంభం
ఏలూరు, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి) : భూము లు, ప్లాట్‌ల రిజిస్ర్టేషన్లు సులభతరంగా చేసేందుకు 11 సబ్ రిజిస్ర్టార్ కార్యాల యాల్లో శనివారం ప్రారం భమైన స్లాట్ బుకింగ్ విధానం విజయవంత మైంది. తొలిరోజు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా 11 కార్యా లయాల్లో 87 డాక్యుమెం ట్లు రిజిస్ర్టేషన్లను సబ్ రిజిస్ర్టార్లు పూర్తి చేశారు. భీమడోలులో 5, చింతలపూడి–18, జంగారెడ్డిగూడెం–7 కామవరపు కోట–13, పోలవరం–4, గణపవరం–7, వట్లూరు– 7, కైకలూరు–7 మండ వల్లి–5 ముదినేపల్లి–2, నూజివీడు 12 చొప్పున డాక్యుమెంట్ రిజిస్ర్టేషన్లు పూర్తి చేశారు. ఏలూరులోని జిల్లా రిజిస్ర్టార్ కార్యాలయంలో అత్య ధికంగా మరో 34 డాక్యుమెంట్లు రిజిస్ర్టేషన్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 121 రిజిస్ర్టేషన్లతో రూ.58.85 లక్షల ఆదాయం సమకూరింది. జిల్లా అంతటా స్లాట్ విధానం అమల్లోకి రావడంతో ఇకపై కక్షిదారుల సమస్యలకు చెక్ పడనుంది. సకాలంలో రిజిస్ర్టేషన్లు సవ్యంగా సాగడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మధ్య దళారీ వ్యవస్థ సమస్య లేకపోవడంతో కక్షిదారులకు మేలు జరనుంది.
Updated Date - Apr 27 , 2025 | 01:10 AM