కైకలూరులో ఆక్రమణలపై సర్వే
ABN, Publish Date - May 03 , 2025 | 12:15 AM
కైకలూరు పట్టణంలో రహదారులు, డ్రెయినేజీల ఆక్రమణలపై అధికారులు సర్వే నిర్వహించి తొలగించేందుకు రంగంలోకి దిగారు. శుక్రవారం కైకలూరు బైపాస్‌రోడ్డులో వార్లకోడు డ్రెయిన్‌పై సర్వే నిర్వహించారు.
కైకలూరు, మే 2 (ఆంధ్రజ్యోతి): కైకలూరు పట్టణంలో రహదారులు, డ్రెయినేజీల ఆక్రమణలపై అధికారులు సర్వే నిర్వహించి తొలగించేందుకు రంగంలోకి దిగారు. శుక్రవారం కైకలూరు బైపాస్‌రోడ్డులో వార్లకోడు డ్రెయిన్‌పై సర్వే నిర్వహించారు. డ్రెయిన్ ఆక్రమణలకు గురవుతున్నట్టు గత నెల 26న ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన విషయం విదితమే. వార్లకోడు వెంబడి ప్రహరీల నిర్మాణం చేయడంతో వర్షాకాలంలో ముంపునీరు పారుదలకు అవ రోధంగా మారే అవకాశం ఉండడంతో సర్వే చేసి తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. బైపాస్‌రోడ్డులో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేసిన భవనాలను సైతం సర్వే చేశారు. ప్రభుత్వ స్థలాల్లో అక్రమణలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని లేకుంటే అధికారుల ఆధ్వర్యంలో తొలగి స్తామని హెచ్చరించారు. కైకలూరులో ఎక్కడ ఆక్రమణలకు పాల్పడిన సర్వే నిర్వహించి తొలగిస్తామని పంచాయతీ కార్యదర్శి ఆనందభూషణం తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వీఆర్వోలు, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - May 03 , 2025 | 12:15 AM