ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

డ్వాక్రా మహిళల అవసరాలను గుర్తించి రుణాలు

ABN, Publish Date - May 21 , 2025 | 12:34 AM

డ్వాక్రా మహిళలకు ఆర్థికంగా చేయూత నందించేందుకు వారి అవసరాలను గుర్తించి రుణాలు అందించేం దుకు ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు వెళ్తుందని రాష్ట్ర వెలుగు(సెర్ప్‌) సీఈవో వాకాటి కరుణ అన్నారు.

కొవ్వలిలో డ్వాక్రా మహిళలతో మాట్లాడుతున్న సెర్ప్‌ సీఈవో కరుణ

సెర్ప్‌ రాష్ట్ర సీఈవో కరుణ

దెందులూరు/పెదపాడు, మే20(ఆంధ్రజ్యోతి): డ్వాక్రా మహిళలకు ఆర్థికంగా చేయూత నందించేందుకు వారి అవసరాలను గుర్తించి రుణాలు అందించేం దుకు ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు వెళ్తుందని రాష్ట్ర వెలుగు(సెర్ప్‌) సీఈవో వాకాటి కరుణ అన్నారు. మంగళవారం దెందులూరు మండలం కొవ్వలిలో డీఆర్‌డీఏ పీడీ విజయరాజు, వెలుగు ఏపీఎం పులి సురేష్‌తో కలిసి డ్వాక్రా సంఘాలతో ఆమె సమావేశం నిర్వహించారు. అనంతరం దెందులూరులోని సెర్ప్‌ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. డ్వాక్రా మహిళలు స్వయంగా చిన్నచిన్న వ్యాపారాలు పెట్టుకుని అభివృద్ధి చెందేందుకు షాపులు, దుకాణాలను ఏర్పాటు చేసుకుంటే వారి యూనిట్‌కు అవసరమైన రుణాలు అందించాలని సెర్ప్‌ అధికారులకు సూచించారు. దెందులూరు ఎంపీడీవో శ్రీదేవి, టీడీపీ మండల అధ్యక్షుడు మాగంటి నారాయణప్రసాద్‌, మోతుకూరి నాని, గారపాటి కొండయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.

రూ. 2,182.16 కోట్ల రుణాలు లక్ష్యం

ఏలూరు జిల్లాలో డ్వాక్రా సంఘాల సభ్యులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,182.16 కోట్ల రుణ ప్రణాళిక లక్ష్యంగా నిర్ధేశించామని సెర్ప్‌ సీఈవో కరుణ తెలిపారు. పెదపాడు మండలం వట్లూరులోని టెక్నికల్‌ ట్రైనింగ్‌ అభివృద్ధి సెంటర్‌లో డీఆర్డీఏ అధికారులు, సిబ్బంది, డ్వాక్రా సంఘాల సభ్యులతో జిల్లా కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి సమక్షంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.

Updated Date - May 21 , 2025 | 12:34 AM