కోడూరు యూపీ పాఠశాల కొనసాగింపు
ABN, Publish Date - Jul 10 , 2025 | 12:18 AM
కోడూరులోని మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ పాఠశాలను యథా తథంగా కొనసాగిస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ముదినేపల్లి, జూలై 9(ఆంధ్రజ్యోతి): కోడూరులోని మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ పాఠశాలను యథా తథంగా కొనసాగిస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల పునర్వవ్యస్థీకరణలో భాగంగా ఈ యూపీ పాఠశాలను డీ గ్రేడ్ చేసి బేసిక్ ప్రైమరీ పాఠ శాలగా మార్పు చేస్తూ గతంలో విద్యాశాఖ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేశారు. ఈ మేరకు సమాచారం రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యాలయం నుంచి ఏలూరు జిల్లా విద్యాశాఖాధికారికి బుధవారం సాయంత్రం అందింది. డీవైఈవో రవీంద్ర భారతి కమి షనర్ ఆదేశాలను మండల విద్యాశాఖాధికారికి తెలిపారు. యూపీ పాఠశాల స్థాయి తగ్గించి ప్రైమరీ పాఠశాలగా మార్పు చేయడంతో 6, 7, 8 తరగతులు చదివేందుకు దూర ప్రాంతంలోని ముదినేపల్లి, పెదపాలపర్రు హైస్కూళ్లకు విద్యార్థులు వెళ్లేందుకు ఎదుర్కొనే ఇబ్బందులపై ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనా లకు స్పందించిన ఉన్నతాధికారులు ఈ పాఠశాలను కొనసాగిం చేందుకే నిర్ణయం తీసుకున్నారు. ఈ స్కూలును కొనసాగించాలని ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ సిఫార్సు చేయడం, ఇటీవల కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈవో వెంకట లక్ష్మమ్మ కోడూరులో డీవైఈవో చేత విచారణ జరిపించారు. స్కూలును కొనసాగించాల్సిన అవసరాన్ని డీవైఈవో తన నివేదికలో పేర్కొనడంతో స్కూలు సమస్య పరిష్కారమైంది. దీంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Jul 10 , 2025 | 12:18 AM