ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్
ABN, Publish Date - Jun 19 , 2025 | 12:20 AM
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు భీమవరం డిపో మేనేజర్ పీఎన్.సత్యనారాయణ మూర్తి తెలిపారు.
నిపుణులతో శిక్షణ.. అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చు
భీమవరం టౌన్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు భీమవరం డిపో మేనేజర్ పీఎన్.సత్యనారాయణ మూర్తి తెలిపారు. బుధవారం ఆర్టీసీ డిపోలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తేలికపాటి లైసెన్స్ కలిగి ఉన్నవారికి ఏపీఎస్ ఆర్టీసీ హెవీ లైసెన్స్ పొందడానికి నిపుణు లతో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. బ్యాచ్‌కు 16 మందికి శిక్షణ ఇస్తామని, మొదటి బ్యాచ్ పూర్తయిన తరువాత రెండో బ్యాచ్ ప్రారంభమవుతుం దన్నారు. లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ పొంది ఏడాది పూర్తి కావాలని, హెవీ వాహన లైసెన్స్ కొరకు ఎల్‌ఎల్‌ఆర్ తీసుకొని ఉండాలన్నారు. తమ వద్ద శిక్షణ పొందిన వారికి ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. భవిష్యత్‌లో డ్రైవర్ పోస్టులు భర్తీ చేస్తే వారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. త్వరలో శిక్షణ ప్రారంభిస్తామన్నారు. రవాణా శాఖ ద్వారా లైసెన్స్ ఇప్పించడంలో తమ సిబ్బంది సహకరిస్తారన్నారు. వివరాలకు 7382924754 నెంబరును సంప్రదించాలన్నారు. అసిస్టెం ట్ మేనేజర్ వై.సురేష్, ట్రైనర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 19 , 2025 | 12:20 AM