ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కొడుకు గెంటేశాడు

ABN, Publish Date - Jul 22 , 2025 | 12:26 AM

తనకు ముగ్గురు కుమారులని ఒక కుమారుడు నా స్థలంలో ఇల్లు నిర్మించుకొని తనను చూడడం లేదని, ఇల్లు తిరిగి ఇప్పించాలని 90 ఏళ్ల వృద్ధురాలు బండి వెంకట నరసమ్మ కలెక్టర్‌ చదలవాడ నాగరాణి వద్ద గోడు వినిపించింది.

కలెక్టరేట్‌లో అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ నాగరాణి

కలెక్టర్‌ వద్ద వృద్ధురాలి గోడు

భీమవరం టౌన్‌, జూలై 21(ఆంధ్రజ్యోతి): తనకు ముగ్గురు కుమారులని ఒక కుమారుడు నా స్థలంలో ఇల్లు నిర్మించుకొని తనను చూడడం లేదని, ఇల్లు తిరిగి ఇప్పించాలని 90 ఏళ్ల వృద్ధురాలు బండి వెంకట నరసమ్మ కలెక్టర్‌ చదలవాడ నాగరాణి వద్ద గోడు వినిపించింది. ప్రజాసమస్యల పరిష్కార వేదికలో సోమవారం వృద్ధురాలు కలెక్టర్‌కు అర్జీ ఇచ్చింది. సమస్య పరిష్కరిస్తాను ధైర్యంగా ఉండండి అని ఆమెను తీసుకెళ్లి అల్పాహారం అందించారు. నరసాపురం ఎన్టీఆర్‌ కాలనీలో బండి వెంకట నరసమ్మ స్థలంలో కుమారుడు సత్యనారాయణ ఇల్లు నిర్మించుకొని తల్లిని బయటకు పంపించేశాడు. వృద్ధులైన తల్లిదండ్రులను పట్టించుకోనివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెకర్‌ హెచ్చరించారు. అనంతరం పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి 260 అర్జీలను స్వీకరించారు..

జిల్లా పోలీస్‌ కార్యాలయంలో..

భీమవరం క్రైం: ప్రజా సమస్యలపై త్వరితగతిన స్పందించి నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని ఎస్పీ అద్నాన్‌ నయీం ఆస్మి పోలీసు అధికారులను ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి 10 ఆర్జీలను స్వీకరించారు. సంబంధిత పోలీసు అధికారు లతో ఫోన్‌లో మాట్లాడి సమస్యల పరిష్కారంపై సూచనలు ఇచ్చారు. ఏఎస్పీ (అడ్మిన్‌) వి.భీమారావు, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ వి.పుల్లారావు, డీసీఆర్‌బి ఇన్‌స్పెక్టర్‌ దేశంశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Jul 22 , 2025 | 12:26 AM