ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సమస్యలపై నిర్లక్ష్యం వద్దు

ABN, Publish Date - Jul 15 , 2025 | 12:38 AM

ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించి పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి ఆదేశించారు.

అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ వెట్రిసెల్వి, జేసీ ధాత్రి రెడ్డి

అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

ఏలూరు రూరల్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించి పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో (పీజీఆర్‌ఎస్‌)లో ప్రజల నుంచి అర్జీలను పరిశీలించి నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ప్రజల నుంచి వివిధ సమస్యలపై అధికారు లకు 389 అర్జీలు అందాయి. కార్యక్రమంలో జేసీ పి.ధాత్రిరెడ్డి, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ ఆర్‌.విజయరాజు, జడ్పీ సీఈవో శ్రీహరి, ఆర్డీవో అచ్యుత్‌ అంబరీష్‌, తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు మెరుగైన సేవలు

ఏలూరు క్రైం, జూలై 14 (ఆంధ్రజ్యోతి): ప్రజల ఫిర్యాదులను ఏఐ బోట్‌ అప్లికేషన్‌ ద్వారా నమోదు చేసి మెరుగైన పోలీసు సేవలు అందిస్తామని ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌ తెలిపారు. ఈ మేరకు జిల్లాలో పోలీసు అధికారు లకు ఎస్పీ ఆదేశాలు ఇచ్చారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదులు పరిష్కా ర వేదిక కార్యక్రమాన్ని ఎస్పీ కిశోర్‌, ఏఎస్పీ ఎన్‌ సూర్య చంద్రరావు, డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్‌ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిదారులతో ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదుపై క్షుణ్ణంగా దర్యాప్తు చేసి చట్ట ప్రకారం న్యాయం చేస్తామన్నారు.

Updated Date - Jul 15 , 2025 | 12:38 AM