ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

లెక్క తేల్చేలా!

ABN, Publish Date - May 31 , 2025 | 12:48 AM

టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల లెక్కను పక్కాగా తేల్చాలని నిర్ణ యించింది.

లెక్క తేల్చేలా!

ఇక నిరంతరాయంగా భూముల రీ సర్వే

మొదటి విడతలో 4 గ్రామాల్లో పూర్తి.. రెండో విడత జూన్‌ నెలాఖరు పూర్తికి యత్నాలు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల లెక్కను పక్కాగా తేల్చాలని నిర్ణ యించింది. రీ సర్వేను ఈ ఏడాది జనవరి 20న తొలి దశలో చేపట్టారు. ఏప్రిల్‌ రెండో దశకు శ్రీకారం చుట్టారు. రోవర్ల కొరత, రెవెన్యూ అధికారుల నిర్లిప్తతతో రెండో దఫా కొత్త నత్తనడకన సాగినా ఈ దశలోనూ 30 గ్రామాల్లో రీ సర్వే పూర్తికి అధికారులు నడుం బిగించారు. జూన్‌ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియను ఒక కొలిక్కి తీసుకు రావడానికి యంత్రాంగం సన్నద్ధం అవుతోంది.

రాష్ట్ర భూపరిపాలనశాఖ కమిషనర్‌ (సీసీ ఎల్‌ఏ) ఆదేశాలతో జిల్లాలో తొలి విడతలో పైలెట్‌గా 24 గ్రామాల్లో 2,923 ఎకరాల్లో రీ సర్వేను చేపట్టారు. ఇందులో పోలవరం మండ లం సరిపల్లికుంట 64.99 ఎకరాలు, నిడమర్రు మండలం పెదరామచంద్రాపురంలో 135, చింతలపూడి మండలం ఆముదాల చిలకలో 274, పెదపాడు మండలంలో అమృత లింగం పేట 448.72 ఎకరాల్లో ప్రక్రియను పూర్తి చేశారు. మిగిలిన 20 గ్రామాల్లోను తుది దశ కు చేరుకుంది. ఈ వారంలోనే భూమికి సం బంధించిన పాస్‌ పుస్తకాలను సిద్ధం చేయను న్నారు. తొలి విడతలో 120 రోజులు గడువు పెట్టుకోగా, ఈసారి రెండో విడతకు ప్రభుత్వం 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందిం చింది. మొత్తం 30 గ్రామాల్లో 36,539.68 ఎక రాల భూమిని ఈ సర్వే పరిధిలోకి తీసుకుని సర్వే చేస్తున్నారు. రెండో దశలోనూ తొలుత ప్రతి మండలంలో రెండు గ్రామాల్లో సర్వే చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఆ తర్వాత ఒక గ్రామానికే పరిమితం చేశారు.

ఖర్చుకు వెనుకాడకుండా...

సర్వే రోవర్లను 126 బ్లాకుల్లో ఉదయం రెండు గ్రామాలు, మధ్యాహ్నం రెండు గ్రామా లకు పంపి ఈ సర్వేను చేస్తున్నారు. మొదటి విడతలో గ్రామానికి రూ.10 వేల చొప్పున రీ సర్వేకు ఖర్చులకు విలేజ్‌ సర్వేయర్లకు ప్రభు త్వం నిధులను విడుదల చేసింది. తాజాగా జరిగే రెండో విడతకు రూ. 8లక్షల వరకు నిధులు విడుదలకు జిల్లా యంత్రాంగం ప్రతి పాదనలు పంపింది. ఖర్చుకు వెనుకాడకుండా రైతులకు ఉచితంగా వారి సమక్షంలోనే సర్వే లు చేస్తున్నారు.

సర్వేకు ముందుగానే సమాచారం..

నేను 3 ఎకరాల 7 సెంట్లు స్థలం గ్రామం లో కొనుగోలు చేశాను. దీనికి సం బంధించి రీ సర్వేకు ముందుగానే గ్రామ సభ పెట్టి వివరాలను అధికారులు చెప్పారు. తర్వాత క్షేత్రస్థాయిలో రోవర్‌ సాయంతో కొలిచి లెక్కలు తీశారు. సవ్యంగానే చేశారు. 3 ఎకరాల 4 సెంట్ల స్థలంకు నాకు పాస్‌బుక్‌ ఇస్తామన్నారు.

– కానూరి శ్రీరామమూర్తి, రైతు, పెదరామచంద్రాపురం

Updated Date - May 31 , 2025 | 12:48 AM