ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అద్దె భవనంలో ఎస్పీ కార్యాలయం

ABN, Publish Date - May 14 , 2025 | 12:38 AM

జిల్లాలో ఎస్పీ కార్యాలయం ఎక్కడనేది తేలలేదు. జిల్లాల విభజనతో భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్సీ కార్యాలయం నాలుగేళ్లుగా అద్దె భవనంలోనే కొనసాగుతోంది.

కొలిక్కిరాని స్థల సేకరణ

ప్రభుత్వ భూమి అందుబాటులో లేదు

సిబ్బంది, ప్రజలకు తప్పని తిప్పలు

భీమవరం క్రైం, మే 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎస్పీ కార్యాలయం ఎక్కడనేది తేలలేదు. జిల్లాల విభజనతో భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్సీ కార్యాలయం నాలుగేళ్లుగా అద్దె భవనంలోనే కొనసాగుతోంది. సొంత భవనం నిర్మించడానికి స్థలం అందుబాటులో లేదు. పట్టణ పరిధిలో ప్రభుత్వ స్థలం లేకపోవడంతో కొనుగోలు చేయాల్సిందే. పాలకోడేరు మండలం గొల్లలకోడేరు గ్రామ పరిధిలోని అద్దె భవనంలో ఎస్పీ కార్యాలయం ఉంది. భీమవరం పట్టణానికి సుమారు 4 కిలోమీటర్ల దూరం కాగా భీమవరం–తాడేపల్లిగూడెం రోడ్డు నుంచి సుమారు 2 కిలోమీటర్లు లోపలికి వెళ్లాలి. వర్షం వస్తే జారిపడుతున్నారు. జిల్లాపోలీసు కార్యాలయాన్ని పట్టణానికి దగ్గరలో ఏర్పాటు చేయాలని అధికారులు ఎన్నోసార్లు అభ్యర్థించినా ఫలితం లేకుండాపోయింది.

3 ఎకరాల స్థలం అవసరం

జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయాలంటేనే సుమారు మూడు ఎకరాల స్థలం కావాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. భీమవరం చుట్టుపక్కన మూడు ఎకరాల ప్రభుత్వ స్థలం లేకపోవడంతో స్థలం కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది. ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని మూడు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేస్తే పోలీసు ప్రధాన కార్యాలయ భవన నిర్మాణం సాధ్యమని పలువురు భావిస్తున్నారు. కొన్ని స్థలాలను జిల్లా అధికారులు పరిశీలించినప్పటికీ అవి తాత్కాలికంగా వాయిదాలు పడుతూనే వస్తుంది. ఎన్డీయే ప్రభుత్వం ద్వారా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం భీమవరం పట్టణానికి దగ్గరలో ఏర్పాటు చేయడానికి నాయకులు అనుకూలంగా ఉన్నట్లు సమాచారం.

అందరికీ దూరాభారం

ప్రతి సోమవారం జరిగే పబ్లిక్‌ గ్రీవెన్స్‌ సెల్‌ కోసం 30 నుంచి 40 మంది ఎస్పీ కార్యాలయానికి వెళుతూ ఉంటారు. వారికి వ్యయ ప్రయాసలు తప్పడం లేదు. ఎస్పీ కార్యాలయంలో స్పెషల్‌ బ్రాంచ్‌, పీసీఆర్‌బీ, ఐవోపీ సిబ్బంది ప్రతిరోజు కార్యాలయానికి వెళ్లవలసి ఉంటుంది. రాకపోకలకు అనువుగా లేని ప్రాంతం కావడంతో ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయం దగ్గరలోకి రావాలని వారు కోరుకుంటున్నారు.

Updated Date - May 14 , 2025 | 12:38 AM