ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కష్టం.. నష్టం

ABN, Publish Date - Jun 22 , 2025 | 12:41 AM

ఆరుగాలం కష్టపడ్డారు.. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టారు.. ఇంటిల్లిపాది నిద్రాహారాలు మానేశారు.. పంట చేతికొస్తే చాలు ఈసారైనా కష్టాలు తీరుతాయని ఆశలు పెంచుకున్నారు. ఆ క్షణం కోసమే ఎదురుచూశారు. గత ఐదు మాసాలుగా సీన్‌ రివర్స్‌. పంటలు దండిగానే పండాయి. మార్కెట్‌ విషయానికొస్తే బోల్తాపడింది

మార్కెట్‌లో ధర లేకపోవడంతో నూజివీడులో గోతిలో వేస్తున్న మామిడి కాయలు

ప్రధాన పంటలకు ధరాఘాతం

వేల ఎకరాల్లో నిలిచిపోతున్న పంట

మామిడి దగ్గర నుంచి మిర్చి వరకు ఇదే పరిస్థితి

రూ.వందల కోట్లలో రైతులకు నష్టం

వరుస దెబ్బలతో చితికిన రైతు కుటుంబాలు

ఆరుగాలం కష్టపడ్డారు.. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టారు.. ఇంటిల్లిపాది నిద్రాహారాలు మానేశారు.. పంట చేతికొస్తే చాలు ఈసారైనా కష్టాలు తీరుతాయని ఆశలు పెంచుకున్నారు. ఆ క్షణం కోసమే ఎదురుచూశారు. గత ఐదు మాసాలుగా సీన్‌ రివర్స్‌. పంటలు దండిగానే పండాయి. మార్కెట్‌ విషయానికొస్తే బోల్తాపడింది. ధర పూర్తిగా డీలా పడింది. కోలుకోలేనంతగా రైతు నష్టపోయాడు. ప్రకృతి వైపరీత్యం కాస్త మార్కెట్‌ మందగమనంలోకి మారి రైతును దెబ్బతీసింది. వందల కోట్ల రూపాయల నష్టాలు మిగిల్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యానవన పంటలతో పాటు మిగతా పంటలది అదే పరిస్థితి. రైతులను క్షేత్రస్థాయిలో గమనించి ఆదుకోవాల్సింది ప్రభుత్వమే. దీనిపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి):

మామిడి.. మటాష్‌

పూత దశలో కోడిపేను.. కోత దశలో పండు ఈగ ఇవి రెండూ రైతును పూర్తిగా దెబ్బతీశాయి. నూజివీడు డివిజన్‌ పరిధిలో 40వేల హెక్టార్లలో మామిడి తోటలు ఉండగా ఏటా ఎకరానికి 50 నుంచి 60 వేల రూపాయలు రైతుకు ఆదాయంగా లభించేది. కాని ఈసారి అన్ని విధాలా మామిడి ముంచింది. అకాల వర్షాలు, మామిడి నాణ్యతను దెబ్బతీశాయి. బంగినపల్లి రకం టన్ను రూ.10 వేల కన్నా పూర్తిగా దిగజారింది. తోతాపురి రకం ధరలు పూర్తిగా పడిపోవడంతో చెట్టు మీద ఉన్న కాయ కోసేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక రైతు చితికిపోయాడు. ఈ ఒక్క ఏడాదే నూజివీడు, పరిసర ప్రాంతాల్లో మామిడి రైతుకు వాటిల్లిన నష్టం అక్షరాలా.. రూ.150 కోట్లు. మామిడి రైతును ఆదుకోవడానికి ప్రతీ ఎన్నికల సమ యంలోను మాదిరిగానే ఈసారి ఎడాపెడా హామీలైతే ఇచ్చారుగానీ.. ఆచరణలో చూపించలేక పోయారు.

మిర్చి.. ధర ఏమార్చి

మంచి నాణ్యతతో కూడిన మిర్చి గోదావరి ఒడ్డున కుక్కునూరు, వేలేరుపాడు వంటి మండలాల్లో పండిస్తారు. లింగపాలెం మండలంలో పండే మిర్చికి మంచి డిమాండ్‌ ఉంది. ఈ ఏడాది దిగుబడులు భారీగా వచ్చాయి. ఏటా మాదిరిగానే ఈసారి పెట్టుబడిపోను తగినంత లాభాలే లభిస్తాయని రైతులంతా ఆశ పడ్డారు. తీరా మార్కెట్‌ ఈసారి మొహం చాటేసింది. గతేడాది క్వింటాకు రూ.18 వేలు ధర పలికింది. ఈ ఏడాది క్వింటాల్‌ రూ.ఏడు వేల నుంచి రూ.13 వేలకు పడిపోయింది. ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర నష్టాన్ని ప్రతీరైతు చవిచూశారు.

కోకోకు చాక్లెట్‌ దెబ్బ

ఉద్యాన వన పంటలకు నెలవైన పెదవేగి మండలంలో ఈసారి పామాయిల్‌ దగ్గర నుంచి కోకో పంట వరకు రైతులకు పరీక్ష పెట్టింది. గత రెండేళ్లుగా పేరొందిన అంతర్జాతీయ చాక్లెట్‌ కంపెనీలు ఐస్‌క్రీం, చాక్లెట్‌ల తయారీకి కోకోను కొనుగోలు చేయాల్సి ఉన్నా ఆ మేర ముందుకు రాలేదు. స్థానిక మార్కెట్‌లలో కోకో కొనేవారు లేక రైతు ముంగిటే కోకో నిల్వలు పెరిగాయి. కొనుగోలు చేయాల్సిందిగా ఒత్తిడి పెరగడంతో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు స్వయంగా రంగంలోకి దిగి కంపెనీలతో ప్రభుత్వపరంగా చర్చించారు. రైతుల నుంచి కిలోకు రూ.500లకు తగ్గకుండా కొనుగోలు చేసేందుకు పచ్చజెండా ఊపారు. కిలో ఒక్కింటికి రూ.50 ప్రభుత్వమే భరించేలా భరోసా ఇచ్చారు. ఇంకోవైపు సుంకం ధరలు పెరగడంతో ఆయిల్‌పాంకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కారణంగా కొంత ప్రభుత్వమే కలుగచేసుకోవాలని ఆయిల్‌పాం రైతులను రక్షించాలనే డిమాండ్‌ తెరముందుకు వచ్చింది. పెట్టుబడులు, నిర్వహణ ఖర్చులు పెరగడం, సమాంతరంగా మార్కెట్‌లో ధర క్షీణించడం రైతును ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

ఈసారి ‘పొగ’ పెట్టింది

ఎకరం పొగాకు పంటకు రూ.మూడు లక్షల వరకు ఖర్చవుతుంది. వర్జీనియా పొగాకు కావడంతో రైతులు మొదటి నుంచి కష్టపడి పండిస్తారు. కాస్తంత పెట్టుబ డులు పెరిగినా అంతే మొత్తంలో అప్పులు చేసి మరీ చేస్తారు. గతేడాది పొగాకు కొనుగోళ్లు రైతుల్లో ఆశ పుట్టించింది. ధర కాస్తా తమకు అనుకూలంగా రావడంతో ఎవరంతట వారు ధైర్యం తెచ్చుకుని మరీ పొగాకు వేశారు. తీరా మార్కెట్‌లో కిలో పొగాకు సరాసరి ధర రూ.275 పలుకగా గరిష్ఠంగా రూ.290, కనిష్ఠంగా రూ.220 మేర ధర కొనసాగింది. ఇదే రైతులను నష్టాల వైపు నెట్టింది. ధర సక్రమంగా లేకపోవడంతో పొగాకును ఇళ్ల వద్ద నిల్వ చేశారు. కోట్ల రూపాయలు విలువైన పంట కాస్తా ఇప్పుడు ఇంటి గడప దాటని పరిస్థితి ఏర్పడింది.

కంపెనీలన్నీ సిండికేట్‌.. పొగాకంతా ఇళ్ల వద్దే..

ఈ ఏడాది పొగాకు కొనుగోళ్లు ప్రారంభం నుంచి గిట్టుబాటు ధరలేదు. గతేడాది కిలో పొగాకు రూ.400 వరకు ధర పలుకగా ఈ ఏడాది సరాసరి రూ.220లోపు కొంటున్నారు. చాలా తక్కువ బేళ్లకు మాత్రమే రూ.290 ధర వస్తుంది. ఎకరానికి రూ.మూడు లక్షల పైనే ఖర్చులయ్యాయి. ఈ ధరలే కొనసాగితే ఎకరానికి రూ.లక్ష వరకు నష్టపోతాం. పొగాకు కంపెనీలన్నీ సిండికేట్‌ అయ్యి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. రైతుల పొగాకంతా ఇళ్ల వద్దనే ఉంది. సీఎం చంద్రబాబు స్పందించాలి. ఎన్‌ఎల్‌ఎస్‌ను మార్క్‌ఫెడ్‌ పరిధిలోకి తీసుకురావాలి. సరాసరి ధర రూ.350 వరకు వస్తే రైతులు అప్పుల ఊబిలో నుంచి బయటపడతారు.

– పరిమి రాంబాబు, రైతు సంఘం అధ్యక్షుడు, పొగాకు వేలం కేంద్రం–1, జంగారెడ్డిగూడెం.

Updated Date - Jun 22 , 2025 | 12:41 AM