ముచ్చటగొలిపే కిచెన్ గార్డెన్
ABN, Publish Date - Jun 04 , 2025 | 12:33 AM
మండలంలోని పెయ్యేరు ప్రాథమిక పాఠశాల ఆవరణ పచ్చదనంతో కళకళలాడుతోంది.
ప్రాథమిక పాఠశాల ఆవరణలో మొక్కలు
ముదినేపల్లి, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెయ్యేరు ప్రాథమిక పాఠశాల ఆవరణ పచ్చదనంతో కళకళలాడుతోంది. ముచ్చటగొలిపే కిచెన్ గార్డెన్ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఉపాధ్యాయులు, విద్యార్థులు వివిధ రకాల పూలు, పండ్ల మొక్కల పెంపకం శ్రద్ధగా నిర్వహిస్తున్నారు. హెచ్‌ఎం బేతాళ రాజేంద్ర ప్రసాద్, ఉపాధ్యాయుడు చక్రధర్ ఆధ్వర్యంలో విద్యార్థులు మొక్కలను దత్తత తీసుకున్నారు. జామ, ఫైనాఫిల్ పండ్లతోపాటు కూరగాయల మొ క్కలు ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాల ఆవరణలో కిచెన్ గార్డెన్ నిర్వహణకు విద్యార్థులు పాఠశాల సమయానికి కంటే ముందే వస్తారు. సెలవుల్లో కూడా ఉపాధ్యాయులు, విద్యార్థులు మొక్కలకు నీళ్లు పోస్తున్నారు.
Updated Date - Jun 04 , 2025 | 12:33 AM