నేటి నుంచే.. నేను బడికి పోతా!
ABN, Publish Date - Jul 04 , 2025 | 12:39 AM
జిల్లావ్యాప్తంగా 6–14 ఏళ్లలోపు బాల బాలి కలందరూ పాఠశాలల్లో చేరేందుకు నేటి నుంచి 15 రోజులపాటు ‘నేను బడికి పోతా’ పేరిట ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్‌కు కలెక్టర్ శ్రీకా రం చుట్టారు.
15 రోజులపాటు ప్రత్యేక ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్
జిల్లాలో ఆరు వేల మంది డ్రాపవుట్లు ఉంటారని అంచనా
ఏలూరు అర్బన్, జూలై 3(ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా 6–14 ఏళ్లలోపు బాల బాలి కలందరూ పాఠశాలల్లో చేరేందుకు నేటి నుంచి 15 రోజులపాటు ‘నేను బడికి పోతా’ పేరిట ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్‌కు కలెక్టర్ శ్రీకా రం చుట్టారు. విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ తక్కువగావున్న టాప్–10 మండలాలను గుర్తించి, వాటిని వివిధశాఖల జిల్లాస్థాయి అధికారులకు దత్తతనివ్వడం ద్వారా ము ఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలందరూ సమీప ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలలో ఖచ్చి తంగా చేరేలా చర్యలు తీసుకోవడంతో పాటు, జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశా లల్లో ఎస్‌ఎంసీల సమావేశాలను రెండు మూడ్రోజుల్లో నిర్వహించి, స్కూలు పరిధి లోని ఆవాస ప్రాంతాల్లో బడిఈడుగల పిల్ల లు బడిబయట (డ్రాపవుట్స్) లేరని తీర్మా నించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్ లో గురువారం నిర్వహించిన సమావేశంలో ‘నేను బడికి పోతా’ ప్రత్యేక ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్‌పై ముద్రించిన పోస్టర్‌ను ఆవిష్కరించ డంతో పాటు, కార్యక్రమ నిర్వహణపై అధి కారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్య, వైద్య, ఐసీడీఎస్, కార్మిక, రెవెన్యూ, సంక్షేమ శాఖలు సమన్వయతో పనిచేయాలని సూ చించారు. గ్రామ/వార్డు సచివాలయం పరి ధిగా తీసుకుని డ్రాపవుట్లందరినీ బడిలో చేర్పించాలన్నారు. డ్రైవ్ సత్ఫలితాలు సా ధించడానికి, రోజువారీ పర్యవేక్షణకు జిల్లా, మండల, గ్రామ/వార్డుస్థాయి కమిటీలను నియమించి నూరుశాతం ఎన్‌రోల్‌మెంట్ బాధ్యతలను అప్పగించారు. డ్రాపవుట్స్ సమాచారాన్నిచ్చేందుకు 95333 99981 నంబరుతో హె ల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. డీఆర్వో విశ్వేశ్వరరావు, డీఈవో వెంకటలక్ష్మ మ్మ, సమగ్రశిక్ష ఏపీసీ పంకజ్‌కుమార్, సీపీ వో వాసుదేవరావు, డీఎంహెచ్‌వో డాక్టర్ మాలిని, ఉప కార్మిక కమిషనర్ శ్రీనివాస రావు, డీఆర్డీయే పీడీ విజయరాజు, డీపీవో అనురాధ, సోషల్ వెల్ఫేర్ జేడీ విశ్వమో హన్ రెడ్డి,ఐటీడీఏ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 04 , 2025 | 12:39 AM