పాలిటెక్నిక్ జోష్
ABN, Publish Date - Jul 17 , 2025 | 12:22 AM
పాలిటెక్నిక్ కోర్సులలో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. సీట్ల భర్తీ జోష్‌ను నింపాయి. మొదటి విడత కౌన్సెలింగ్‌లోనే 70 శాతానికి పైగా సీట్లు భర్తీ అయ్యాయి. మిగిలిన సీట్లు రెండో విడత కౌన్సెలింగ్‌లో ఫుల్ అయ్యే అవకాశం వున్నట్లు కళాశా లల యాజమాన్యాలు భావిస్తున్నాయి.
తొమ్మిది కళాశాలల్లో 3,080 సీట్లు
ఇప్పటి వరకు 2,161 మంది విద్యార్థులు చేరిక
ఎలకా్ట్రనిక్స్, కంప్యూటర్ కోర్సులపై మక్కువ
సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో మరిన్ని భర్తీ
పూర్వ వైభవం వచ్చినట్టేనంటున్న యాజమాన్యాలు
(భీమవరం రూరల్–ఆంధ్రజ్యోతి)
పాలిటెక్నిక్ కోర్సులలో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. సీట్ల భర్తీ జోష్‌ను నింపాయి. మొదటి విడత కౌన్సెలింగ్‌లోనే 70 శాతానికి పైగా సీట్లు భర్తీ అయ్యాయి. మిగిలిన సీట్లు రెండో విడత కౌన్సెలింగ్‌లో ఫుల్ అయ్యే అవకాశం వున్నట్లు కళాశా లల యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో తొమ్మిది పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో 3,080 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు 2,161 సీట్లలో విద్యార్థులు చేరారు. ఇక 919 సీట్లు మాత్రమే మిగిలాయి.
మూడు కోర్సుల్లో డిమాండ్ అధికం
పాలిటెక్నిక్‌లో ఈ సారి మూడు కోర్సులపై విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి కనబరిచారు. తొలుత ఎక్కువ మంది ఎలక్ర్టానిక్స్ వైపు మొగ్గు చూపించారు.
ఎలక్ర్టానిక్స్ విభాగంలో 810 సీట్లు ఉంటే 706 మంది విద్యార్థు లు చేరారు. ఇక 104 సీట్లు మాత్రమే మిగిలాయి. రెండో విడత కౌన్సెలింగ్‌లో ఇవి పూర్తిగా భర్తీ అయ్యే అవకాశం వుంది.
కంప్యూటర్ కోర్సుల్లో 917 సీట్లకు 652 మంది విద్యార్థులు చేరారు. 265 సీట్లు ఉన్నాయి.
ఇన్‌స్ట్రుమెంటేషన్ కోర్సుల్లో 65 సీట్లకు గాను 62 భర్తీ అయ్యాయి. మూడు సీట్లు మిగిలాయి.
జూ ఎలక్ట్రికల్ విభాగంలో 511 సీట్లకు గాను 362 సీట్లు భర్తీ కాగా ఇంకా 149 సీట్లు మిగిలే వున్నాయి.
మెకానికల్ విభాగంలో 480 సీట్లకు గాను 257 భర్తీ అయ్యాయి. ఇంకా 240 సీట్లు మిగిలిపోయాయి.
సివిల్ విభాగంలో 165 సీట్లకు గాను 79 మంది విద్యార్థులు చేరడంతో ఇంకా 86 సీట్లు మిగిలాయి.
ఏఐ కోర్సుకు 132 సీట్లు ఉండగా 44 మంది చేరారు. ఇంకా 88 సీట్లు భర్తీ చేయాల్సి వుంది.
పాలిటెక్నిక్‌పై పెరిగిన మక్కువ
రెండేళ్లుగా పాలిటెక్నిక్‌లో చేరేందుకు విద్యార్థులు మక్కువ చూపుతున్నారు. టెన్త్ అయ్యాక పాలిటెక్నిక్‌లో చేరి తదుపరి ఇంజ నీరింగ్‌కి వెళ్లాలనుకుంటున్నారు. పాలిటెక్నిక్ పూర్తిచేసినాఉద్యోగ అవకాశాలు ఉంటాయనే అంచనాలో ఉన్నారు. 2025 పాలిసెట్‌లో ఉమ్మడి జిల్లాలో నాలుగు వేల మంది ఉత్తీర్ణత సాధించారు.
అడ్మిషన్లు పెరగడానికి ఇదే కారణం
పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్లు భర్తీ పెరగడానికి ముందస్తుగా తరగతులు ప్రారంభం కావడమే ఓ కారణం. మూడేళ్ల క్రితం పాలిసెట్ ముందుగా నిర్వహించినా కౌన్సెలింగ్ ఆలస్యమయ్యేది. ఒక ఏడాది ఆలస్యంగా కౌన్సెలింగ్ నిర్వహించడంతో సీట్ల అలాట్‌మెంట్‌కు సెప్టెంబరు, అక్టోబరు నెలల వరకు కొనసాగింది. 2023–24, 2024–25 సంవత్సరాల్లో పాలిసెట్ త్వరగా నిర్వహించి, వెనువెంటనే ఫలితాలు ఇవ్వడం, రోజుల వ్యవధిలోనే కౌన్సెలింగ్ పూర్తవడంతో జూలైలోనే తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కారణంగా పాలిసెట్ రాసి ఉత్తీర్ణత సాధించిన ప్రతి విద్యార్థి పాలిటెక్నిక్‌లో చేరేందుకు ఆసక్తి చూపారు.
మంచి కాలేజీ ఎంచుకోవడానికి..
ఇంజనీరింగ్‌లో మంచి కళాశాలలో చేరేందుకు వీలు ఉండదేమో అన్న అంచనాతో విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సు వైపు వెళ్తున్నారు. పాలిటెక్నిక్‌లో మంచి ప్రతిభ కనబర్చి తదనంతరం ఇంజనీరింగ్ సెకండియర్‌లోకి వెళ్లేలా ప్రణాళిక చేసుకుంటున్నారు. ఆ సమయంలో వారికి నచ్చిన, అందుబాటులో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్తున్నారు. ఆ విధంగా మంచి కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేయడానికి పాలిటెక్నిక్ ఒక దారిగా వారికి ఏర్పడుతుంది.
Updated Date - Jul 17 , 2025 | 12:22 AM