ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మాకెన్నాళ్లీ .. బాధలు..!

ABN, Publish Date - Jul 08 , 2025 | 12:43 AM

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 41.15 కాంటూరు లెవెల్‌లో ముంపునకు గురవుతున్న నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందించి పునరావాస కాలనీ లకు తరలిస్తామని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. అయితే క్షేత్రస్థాయిలో వంద లాదిమంది నిర్వాసితులకు పరిహారం అం దలేదు.

తహసీల్దార్‌కు వినతి పత్రం అందిస్తున్న రేపాకగొమ్ము గ్రామస్థులు

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల ఆవేదన

ఓ పక్క గోదావరి గుబులు..

మరో పక్క పరిహారం కోసం పడిగాపులు

కుక్కునూరు, జూలై 7(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 41.15 కాంటూరు లెవెల్‌లో ముంపునకు గురవుతున్న నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందించి పునరావాస కాలనీ లకు తరలిస్తామని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. అయితే క్షేత్రస్థాయిలో వంద లాదిమంది నిర్వాసితులకు పరిహారం అం దలేదు. ఓ పక్క గోదావరిలో వరద పెరు గుతుండడం నిర్వాసిత గ్రామస్థుల్లో గుబు లు రేపుతోంది. ఎప్పుడు ముంచెత్తుతుం దోనని భయపడుతున్నారు. పరిహారం అందకపోవడంతో గ్రామాల్లోని ఇళ్లు ఖాళీ చేసేందుకు మొగ్గు చూపడం లేదు.

‘అయ్యా.. మాకు అన్ని అర్హతలున్నాయి పరిహారం ఇప్పించండి’ అంటూ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన క్షేత్రస్థాయిలో విచారణ జరు పుతున్నారే కానీ సమస్య పరిష్కరించడం లేదు. 41.15 కాంటూరు లెవెల్‌ కుక్కు నూరు, వేలేరుపాడు మండలాల్లో తొలుత 25 గ్రామాలను ముంపునకు గురవుతా యని గుర్తించారు. కుక్కునూరు మండలం లో ఎనిమిది, వేలేరుపాడులో 17 గ్రామాల ను ముంపులో చూపించారు. ఈ క్రమంలో నిర్వాసితులకు ఈ ఏడాది జనవరి 3వ తేదీన దాదాపు రూ.850 కోట్లను నిర్వాసి తుల ఖాతాల్లో జమ చేశారు. నిర్వాసితు లకు వ్యక్తిగత పునరావాస పరిహారంతో పాటు కోల్పోతున్న ఇళ్లకు, పునరావాస కాలనీలో ఇళ్లు వద్దనుకున్న వారికి పరి హారం చెల్లించారు. అయితే ఇంకా వంద లాది మంది నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందలేదు. ఏనాడు గ్రామం విడిచి వెళ్లనివారి పేర్లు సైతం జాబితాలో లేకపోవడంతో వారికి పరిహారం అంద లేదు. పునరావాస కాలనీలో ఇళ్లు వద్దను కున్న వారికి దాదాపు 3.85 లక్షలు పరి హారం చెల్లించాలి. గొమ్ము గూడెంలో భర్త చనిపోయిన సుమారు 20 మంది మహి ళలకు పరిహారం అందలేదు.

కుక్కునూరు ఏ.బ్లాక్‌లో 120 మంది, చివ్వాకలో 110 మంది ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితులకు ఇంటి పరిహారం అంద లేదు. దీంతో తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామాల్లో ముంపునకు గురవుతున్న ఇళ్లు కూడా జాబితాలో గల్లం తవ్వడం శోచనీయం. అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి నిర్వాసితులకు న్యా యం చేయాలని కోరుతున్నారు. కాగా ఓ వైపు గోదావరి పెరుగుతోంది. పరిహారం అందని నిర్వాసితులు ఇళ్లు ఖాళీ చేసేం దుకు మొగ్గు చూపడం లేదు. పరిహారం అందకుండా ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తు న్నారు.

ఏనాడు గ్రామం విడిచి వెళ్లలేదు..

నేను పుట్టిననాటి నుంచి ఏనాడు గ్రామం విడిచి వెళ్లలేదు. నా పేరు పునరావాస పరిహార జాబితాలో లేదు. అదికారుల చుట్టూ తిరిగి విసిగిపోయాను. చేసేదిలేక చివరికి న్యాయం కోసం కోర్టుకు వెళ్లాను.

– కాకులమారి సుధాకర్‌, కుక్కునూరు ఏ.బ్లాక్‌ నిర్వాసితుడు.

పరిహారం అందలేదు

మాది గొమ్ముగూడెం. మా గ్రామం నుంచి ఆర్‌అండ్‌ ఆర్‌ పరిహారం చెల్లించారు. నాకు మాత్రం పరిహారం అందలేదు. ఏ నాడు గ్రామాన్ని విడిచి వెళ్లలేదు. కానీ నాకు పరిహారం అంద లేదు. అధికారులు న్యాయం చేయాలి.

– బావి కృష్ణమాచారి, గొమ్ముగూడెం.

పునరావాస కాలనీల్లో సౌకర్యాలు కల్పించండి..

తహసీల్దార్‌కు రేపాకగొమ్ము గ్రామ ప్రజల వినతి

వేలేరుపాడు, జూలై 7(ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరదలు వచ్చే ప్రమాదం ఉందని, తాము గ్రామాన్ని ఖాళీ చేసి పునరావాస కాలనీలకు వెళ్లడానికి అక్క డ అనేక సమస్యలున్నాయని సౌకర్యా లు కల్పించి తమను కాలనీలకు తరలిం చేలా చర్యలు తీసుకోవాలని రేపాక గొమ్ము గ్రామస్థులు తహసీల్దార్‌ డీవీ. సత్యనారాయణకు సోమవారం వినతి పత్రం ఇచ్చారు. అధికారులు తమ గ్రామం ఖాళీ చేసి పునరావాస కాలనీ లకు వెళ్లాలని ఒత్తిడి తెస్తున్నారని, కాలనీల్లో కనీస వసతులు కల్పిస్తే తాము వెళ్లడానికి సిద్ధమేనన్నారు. అర కొర వసతుల మధ్య అక్కడ ఉండ లేమని స్పష్టం చేశారు. ఉన్నతాధి కారుల దృష్టికి తీసుకెళ్లి అన్ని సౌకర్యా లు వరదలు వచ్చేలోపే కల్పించేలా తీసుకుంటామని తహసీల్దార్‌ హామీ ఇచ్చారు.

Updated Date - Jul 08 , 2025 | 12:43 AM