ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మొక్కలు.. చిక్కులు!

ABN, Publish Date - Jun 11 , 2025 | 01:08 AM

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో కోటి మొక్కలు నాటాలని ఈనెల 5న ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. జిల్లాలో 4లక్షల50వేలు అన్ని శాఖ తరపున నాటాల్సిదేనంటూ జిల్లా యంత్రాం గం ఆదేశాలతో ప్రభుత్వ శాఖల్లో గుబులు రేగుతోంది.

నాటిన మొక్కలకు రక్షణ ఎలా..?

27 శాఖల్లోనూ అంతర్మథనం

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో కోటి మొక్కలు నాటాలని ఈనెల 5న ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. జిల్లాలో 4లక్షల50వేలు అన్ని శాఖ తరపున నాటాల్సిదేనంటూ జిల్లా యంత్రాం గం ఆదేశాలతో ప్రభుత్వ శాఖల్లో గుబులు రేగుతోంది. మండే ఎండల్లో మొక్కలు ఎలా నాటాలన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. నాటిన వాటిని రక్షించడం ఎలా..? ట్రీ గార్డులు ఎవరు సమకూరుస్తారు..? లక్ష్యం ఘనంగా ఉన్నా చేరుకునే దారేది ఏది అంటూ నిట్టూర్పులు వ్యక్తమ వుతున్నాయి.

(ఏలూరు– ఆంధ్రజ్యోతి) :

పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రభుత్వం కృషి సల్పుతోంది. పర్యావరణ దినోత్సవం సందర్భంగా పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి ఇప్పటికే శ్రీకారం చుట్టింది. జిల్లా వ్యాప్తంగా నాలుగులక్షల 50వేల మొక్క లు నాటాలని లక్ష్యంగా నిర్దేశించి అటవీశాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వం నర్సరీల నుంచి ఉచి తంగా సరఫరాను ప్రారంభించింది. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖలు మొక్కలను తీసుకెళ్లి ఖాళీ స్థలాలు, రోడ్ల వెంబడి నాటుతున్నాయి. ప్రవేట్‌ సంస్థలు సైతం అటవీశాఖ నర్సరీల నుంచి పెద్ద సంఖ్యలో మొక్కలు తీసుకెళ్తు న్నాయి. ఎంపీడీవోల ఆధ్వర్యంలో పదివేలు మొక్కలు ఎక్కడ నాటుతారు? జిల్లాలో 2,225 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇప్పటికే వివిధ ఆకు కూరలు, ఇతర కూరగాయల మొక్కలు పెంప కం చేపట్టారు. ఈ శాఖ పరిధిలోనే 37 వేల మొక్కలు ఎక్కడ నాటుతారన్నది ఆ శాఖలో గుబులు రేగుతోంది. కొన్ని రకాల మొక్కలకే అటవీశాఖ పరిమితం అయితే ఉపయోగం ఉండదు. స్కూల్స్‌, అంగన్‌వాడీ, ప్రభుత్వ కార్యాలయాల్లో జామ, నేరేడు, బొప్పాయి, కరి వేపాకు, ములగచెట్లు అందిస్తే వాటి సంరక్ష ణకు సిబ్బందిలో ఎవరో ఒకరు ముందుకొ స్తారు. అలా కాకుండా అడవి తుమ్మ, తంగే డు, ఇతర భారీ వృక్షాలను నాటిన సంరక్షణ కష్టమేనన్న వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. ఏర్పాటు చేసిన మొక్కలకు ట్రీ గార్డులను ఆయా శాఖల అధికారులే సమకూర్చుకోవడం కష్టతరమే. చిన్న,చితకాశాఖల్లో నిర్వహణ వ్యయం కష్టంగా ఉంది. తాజాగా ఈ మొక్కల సంరక్షణ చేయడం ఎలా అన్న ప్రశ్న ఉత్ప న్నం అవుతోంది.

గుంతలు.. ట్రీ గార్డుల పరిస్థితేమిటి?

ఒక్క మొక్క నాటాలంటే భూమిని తవ్వా లి. అయితే ఇందుకు సరిపడా పనిమట్లు ప్రభుత్వ కార్యాలయాల్లో అందుబాటులో ఉండవు. వీటికి అటెండర్లనే ఉపయోగించాలి. మొక్కలకు గుంతలు తవ్వేందుకు ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తే ప్రతీ గ్రామం లో, మండలంలో లక్ష్యాలు అధిగమించవచ్చని, ట్రీ గార్డుల పరంగా పర్యావరణ హితంగా వెదురుతో తయారు చేసిన వాటిని జిల్లా యంత్రాంగమే కొనుగోలు చేయించి సరఫరా చేయాలన్న సూచనలు వ్యక్తమవుతున్నాయి. పారిశ్రామిక వేత్తలు, షాపుల యజమానుల సహకారంతో మున్సిపాల్టీలు, మండల పరి షత్‌, తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద మొక్కల సంరక్షణకు ఆదేశాలు ఇచ్చే దిశగా జిల్లా యంత్రాంగం ఆలోచన చేస్తే లక్ష్యం 4లక్షలు 50 మొక్కలు నాటడం పూర్తవు తుందన్న భావన వ్యక్తమవుతోంది. నాటిన ప్రతీ మొక్కకు జియో ట్యాగింగ్‌ ఇవ్వడం, దాన్ని ఆయా కార్యాలయాల పరిధిలో నమో దు చేయించడం ద్వారా లెక్కలు తేలుతాయి.

వేలల్లో మొక్కలు నాటేదెలా ?

జిల్లాలోని 27 మండలాల్లో ఆయా శాఖల వారీగా మొక్కలు నాటే లక్ష్యాన్ని ఇటీవల నిర్ణయించారు. జడ్పీ ఆధ్వర్యంలో 74,790, డ్వామా ఆధ్వర్యంలో 60,750, డీఆర్‌డీఏ 54 వేలు, డీపీవో 33,750, ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో 33,750, విద్యాశాఖలో 27వేలు, మెప్మా 25వేలు, హౌసింగ్‌ 27వేలు, వ్యవసాయశాఖ 18,900, ఐటీడీఏ 17,500 మొక్కలు నాటా లంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇంత వరకు బాగున్న అటవీశాఖ నుంచి ఈ సంఖ్యల్లో మొక్కలు చేరుకోలేదు. కేవలం వందల్లోనే అందగా, పర్యావరణ దినోత్సవం రోజున చాలా శాఖల్లో స్ధానిక నర్సరీల్లో కొనుగోలు చేసి చేతి చమురు వదలిచ్చుకుని మొక్కలు నాటారని సమాచారం. వెయ్యి లేదా రెండు వేలంటే ఏదోరకంగా నాటవచ్చని అంతకుమిచ్చిన సంఖ్యలో మొక్కలు నాటడం ఎలా అని అధికారులు అంతర్మథనం చెందు తున్నారు. ప్రతీ నెల కొంత మేర లక్ష్యాలను నిర్దేశించి ఆగస్టు వరకు ఈ కార్యక్రమం విడతల వారీగా కొనసాగిస్తే నాటిన మొక్కలు నిలుస్తాయి. వర్షాకాలంలో నాటడానికి పరిసరాలు అనువుగా ఉంటాయన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Updated Date - Jun 11 , 2025 | 01:08 AM