70 ఆలయాలకే జాబితాలు
ABN, Publish Date - May 31 , 2025 | 12:27 AM
జిల్లాలో దేవాలయాలకు ట్రస్ట్ బోర్డుల నియామకంపై ఇప్పటి వరకు 70 ఆలయాలకే జాబితాలు వెళ్లాయి. ఇంకా 59 పెండింగ్‌లో వున్నాయి.
పెండింగ్‌లో మరో 59
దేవాలయాల ట్రస్ట్ బోర్డుల తొలి విడత దరఖాస్తులకు ముగిసిన గడువు
నియోజకవర్గాల్లో తేలని పంచాయితీ.. ఆశావహుల్లో గట్టి పోటీ
నేతల సిఫారసులతోనే నియామకాలు
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో దేవాలయాలకు ట్రస్ట్ బోర్డుల నియామకంపై ఇప్పటి వరకు 70 ఆలయాలకే జాబితాలు వెళ్లాయి. ఇంకా 59 పెండింగ్‌లో వున్నాయి. తొలి విడత 129 దేవాలయాల పాలకవర్గాలకు మే ఆరో తేదీన నోటిఫికేషన్ విడుదలైంది. పాలక వర్గాల్లో నియమితులయ్యేందుకు ఆసక్తి ఉన్న వారు 20 రోజుల్లోగా దరఖాస్తులు అందజేయాలని సూచించింది. ఇప్పటికి 70 ఆలయాలకు దరఖాస్తులు ఉన్నతాధికారులకు అందాయి. మిగిలినవి స్థానిక కార్యనిర్వాహక అధికారుల వద్ద ఉండిపోయాయి. గడువు మీరిపోవడంతో వీటిని జిల్లా అధికారులకు పంపాలా? వద్దా? అనే మీమాంసలో ఉన్నారు. మరోవైపు నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు ఈ విషయమై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఆలయ పాలక వర్గాలకు పోటీ ఎక్కువగా ఉంది. చైర్మన్ పదవికి కూటమి శ్రేణుల్లో అత్యధికులు పోటీ పడుతున్నారు. జనసేన ప్రాతి నిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో నామినేటెడ్ పదవుల ను 50 శాతం ఉండేలా సర్దుబాటు చేస్తూ వస్తున్నారు. భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం నియోజకవర్గాల్లో ఇదే పంథా కొనసాగుతోంది. ఇప్పటి వరకు సొసైటీలు, నీటి సంఘాలు, విద్యా కమిటీల విషయంలో సర్దుబాటు ధోరణితోనే వెళ్లారు. ఆ మేరకే నీటి సంఘాలు, విద్యా కమిటీల నియామకాలు జరిగాయి. కూటమి నేతలు ఆశిం చిన వారికే పదవులు వరించాయి. సహకార సొసైటీల విషయంలోనూ ఇదే రకంగా త్రిసభ్య కమిటీల జాబితా లను అధిష్ఠానానికి పంపారు. ఇదే క్రమంలో ఆలయాల ట్రస్ట్‌బోర్డుల విషయంలోనూ చర్చించుకున్నారు. పాలక వర్గాల జాబితాలను పంపే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగుదేశం ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండి, పాలకొల్లు, ఆచంట, తణుకు నియోజకవర్గాల్లోనూ మిత్రపక్షాలకు అవకాశాలు కల్పిస్తున్నారు.
ట్రస్ట్ బోర్డులకు పోటీ
మావుళ్లమ్మ, పంచారామ క్షేత్రాలు, ఇతర ముఖ్యమైన దేవాలయాలకు నోటిషికేషన్ విడుదల చేయలేదు. తదుప రి పాలకవర్గాలను నియమించనున్నారు. తొలి విడతగా గ్రామ, మండలస్థాయిలో పేరున్న దేవాలయాలకు మాత్రమే భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆల యాల్లో సేవలు చేసేందుకు చైర్మన్ పదవి కావాలన్న ఉద్దే శంతో కూటమి శ్రేణులు పోటీ పడుతున్నాయి. నియోజక వర్గ ప్రజా ప్రతినిధులు ఈ విషయమై తేల్చుకోలేకపో తున్నారు. ఇతర ప్రభుత్వ బాధ్యతల్లోనూ బిజీగా ఉంటు న్నారు. దీంతో నోటిఫికేషన్ ఇచ్చిన దేవాలయాలకు పూర్తి గా జాబితాలు చేరుకోలేదు. ఆలయాల వారీగా అందిన దరఖాస్తులను పరి శీలించి ప్రభుత్వానికి జాబితా పంపను న్నారు. ఆ తర్వాత దేవదాయ శాఖ పాలకవర్గాలను నియమించనుంది. ఇప్పటికీ దరఖాస్తులు అందని ఆలయా లకు మరోసారి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇతర ముఖ్య దేవాలయాలకు సంబంధించిన పాలక వర్గ నియామకాల పైనా కుస్తీ పడుతున్నారు. ప్రభుత్వం ఆదేశించిన తక్షణమే జాబితాలు పంపేలా ప్రజా ప్రతినిధులు ప్రయత్నాలు చేస్తున్నారు. పోటీ అధికంగా ఉండడం వల్ల 59 దేవాలయాలపై జాబితాలు వెళ్లడంలో జాప్యం జరిగింది. వీటిపై ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.
Updated Date - May 31 , 2025 | 12:27 AM