పట్టిసీమ పరవళ్లు
ABN, Publish Date - Jul 04 , 2025 | 12:48 AM
పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి పరవళ్లు తొక్కింది. భారీ జల వనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, మద్దిపాటి వెంకట్రాజు, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు గురువారం పంప్ హౌస్‌లో 8, 13, 17, 26, 33, 35 నెంబర్ల మోటార్లను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు.
ఎత్తిపోతల పథకం నీరు విడుదల చేసిన మంత్రి నిమ్మల
పోలవరం, జూలై 3(ఆంధ్రజ్యోతి): పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి పరవళ్లు తొక్కింది. భారీ జల వనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, మద్దిపాటి వెంకట్రాజు, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు గురువారం పంప్ హౌస్‌లో 8, 13, 17, 26, 33, 35 నెంబర్ల మోటార్లను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ముందుగా వేద పండితులతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పట్టిసీమ ఎత్తిపోతల మోడల్ హౌస్‌లో పట్టిసీమ డెలివరీ ఛానల్ నమూనా ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలించారు. తర్వాత మంత్రి తాడిపూడి ఎత్తిపోతల పథకాన్ని స్విచాన్ చేసి ప్రారంభించి పట్టిసీమ ఎత్తిపోతల పథకం డెలివరీ ఛానల్ వద్ద గోదావరి మాతకు చీరసారెలు సమర్పించారు. ప్రాజెక్టు ఎస్‌ఈ రామచంద్రారెడ్డి, ఈఈ ఏసుబాబు, సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు గడ్డమనుగు సాయి, గునపర్తి చిన్ని, బొడ్డు కృష్ణ, నునకాని రాంబాబు, కుంచే దొరబాబు, కరిబండి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
బట్రస్ డ్యాం పనుల పరిశీలన
పోలవరం ప్రాజెక్టులో బట్రస్ డ్యాం నిర్మాణ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పనుల ప్రగతిని ఎస్‌ఈ రామ చంద్రారెడ్డి, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎగువ కాఫర్ డ్యాం సీపేజీ అవాంతరాలతో పనులు జాప్యం కాకుండా బట్రస్ డ్యాం నిర్మాణం చేపట్టామన్నారు. వర్షాల సీజనులో సైతం డయాఫ్రంవాల్ పనులు నిరాటకంగా కొనసాగడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. డయాఫ్రంవాల్ నిర్మాణం 360 మీటర్లు పూర్తి చేయడం జరిగిందన్నారు.
Updated Date - Jul 04 , 2025 | 12:48 AM