కల్లాలు ఖాళీ.. ఖాతాలు నిండె
ABN, Publish Date - Apr 26 , 2025 | 12:35 AM
జిల్లాలో ధాన్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కల్లాల నుంచి ధాన్యం తరలించగానే రైతుల ఖాతాలో సొమ్ము జమ అవుతోంది.
2,07,721 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
రైతులకు రూ.450 కోట్ల్ల చెల్లింపు
విక్రయానంతరం కనిష్ఠంగా 4 గంటలు గరిష్ఠంగా 48 గంటల్లో సొమ్ము జమ
జిల్లాలో ధాన్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కల్లాల నుంచి ధాన్యం తరలించగానే రైతుల ఖాతాలో సొమ్ము జమ అవుతోంది. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తేమ శాతంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అవసరమైన గోనె సంచులు అందుబాటులో ఉంచి అమ్మకాలకు అనువైన ఏర్పాట్లు చేస్తున్నారు. వెంటనే సొమ్ము అందడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పెంటపాడు, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ధాన్యం కొను గోళ్లు జోరుగా సాగుతున్నాయి. 261 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని రైతుల నుంచి సేకరిస్తున్నారు. వాతావరణం అనుకూలించ డంతో కల్లాల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలిస్తు న్నారు. వారం రోజుల క్రితం మబ్బులు, చిరుజల్లులతో రైతులు ఆందోళన చెందారు. సరిపడా సంచులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఐదేళ్లుగా ధాన్యం అమ్మకాలలో ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు ప్రస్తుతం సాఫీగా అమ్మకం సాగిస్తున్నారు. కల్లాల్లో ధాన్యం వెంటనే అమ్మకానికి వెళ్లడంతో పాటు ఆన్‌లైన్‌లో నమోదైన 24 నుంచి 48 గంటల వ్యవధిలో రైతుల ఖాతాలో సొమ్ము జమ అవు తోంది. చాలామందికి నాలుగు లేక ఐదు గంటల్లోనే నగదు జమ అవు తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పౌర సరఫరాల మేనేజర్ టి.శివరామప్రసాద్ క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులతో నేరుగా మాట్లాడుతున్నారు. సకాలంలో సొమ్ములు జమ అవుతున్నాయా, సంచులు, ట్రక్ షీట్ ఇబ్బందులపై ఆరా తీస్తున్నా రు. ధాన్యం అమ్మకాలలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడా లంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
2,07,721 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
వాతావరణం అనుకూలించడంతో అధికారులు నిత్యం క్షేత్రస్థాయి పర్యటనలతో తేమశాతం 17 వచ్చేలా చూసి అమ్మకాలు జరుపుకోవా లని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన 261 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు జోరుగా అమ్మకాలు జరుపుతున్నారు. జిల్లాలో ఇప్పటివరరకు 21920 మంది రైతుల నుంచి రూ.479 కోట్ల విలువైన 2,07,721 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇప్పటివరకూ రైతుల ఖాతాల్లో రూ. 450 కోట్లు జమ అయ్యాయి. ఇంకా రూ.29 కోట్లు మాత్రమే రైతులకు చెల్లిం చాల్సి ఉంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నెలల తరబడి రైతులు ధాన్యం సొమ్ముల కోసం పడిగాపులు కాయాల్సి వచ్చేది. ప్రస్తుతం ధాన్యం అమ్మిన కొద్ది గంటల వ్యవధిలో సొమ్ము జమ అవుతుండండంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటివరకు 90,14,453 సంచుల పంపిణీ
గత వైసీపీ ప్రభుత్వంలో ధాన్యం అమ్మకాలకు రైతుల ఇబ్బందు లు వర్ణణాతీతం. ఆరబెట్టిన ధాన్యాన్ని సంచులలో వేసుకుందామంటే అవికూడా నాణ్యతగా ఉండేవి కాదు. ప్రస్తుతం రైతులకు అవసర మైన గోనె సంచులను మిల్లులో ముందుగానే సిద్ధం చేసి పెడుతు న్నారు. దాళ్వా సీజన్‌లో 90,14,453 సంచులను రైతుసేవా కేంద్రాల ద్వారా అందజేశారు. వీటిలో రైతులు 51,93,025 సంచులను వినియోగించుకున్నారు. జిల్లాలో 3480 మంది హమాలీలు ధాన్యం కొనుగోలులో పని చేస్తున్నారు. ధాన్యం రవాణాకు 3416 వాహనాలను రిజిస్ర్టేషన్ చేయించి ఎటువంటి ఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ధాన్యం అమ్మకాలలో సమ స్యలు ఉంటే కంట్రోల్ రూం నెంబర్ 8121676653లో తెలియజేయాలని సూచిస్తున్నారు.
నాలుగు గంటల్లో నగదు జమ
ఆరు ఎకరాలు సాగు చేశాను. ధాన్యం అమ్మకాలలో ఎలాంటి ఇబ్బంది లేదు. ధాన్యం అమ్మిన 4 గంటల్లో నా ఖాతాలో నగదు జమ అయింది. చాలా సంతోషంగా ఉంది. ఇప్పటివరకూ ధాన్యం అమ్మిన సొమ్ములు సకాలంలో అందక ఇబ్బందులు పడ్డాం.
– వెలగల వెంకట శ్రీనివాసరెడ్డి, రైతు, పెంటపాడు
సంచుల ఇబ్బంది లేదు
పది ఎకరాలు కౌలుకు సాగు చేశాను. రైతు సేవా కేంద్రాల ద్వారా ఽగోనె సంచులు సకాలంలో ఇస్తున్నా రు. గంటల వ్యవధిలోనే ఖాతాలో సొమ్ములు జమ అవుతున్నాయి.
– బయ్యే వెంకటేశ్వరరావు, కౌలు రైతు, బిళ్లగుంట
Updated Date - Apr 26 , 2025 | 12:35 AM