ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రైతుల ఖాతాలకు ధాన్యం సొమ్ములు

ABN, Publish Date - Jul 03 , 2025 | 12:40 AM

రైతులకు కాస్త ఊరట లభించింది. ప్రభుత్వం ధాన్యం బకాయిలను చెల్లించింది. జిల్లాలో రైతులకు తాజాగా రూ. 112 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.

మరో రూ.182 కోట్ల పెండింగ్‌

(భీమవరం–ఆంధ్రజ్యోతి): రైతులకు కాస్త ఊరట లభించింది. ప్రభుత్వం ధాన్యం బకాయిలను చెల్లించింది. జిల్లాలో రైతులకు తాజాగా రూ. 112 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. మరో రూ.182 కోట్లు చెల్లించాల్సి ఉంది. దాదాపు 75 రోజుల తరువాత బకాయిలను చెల్లించడంతో రైతులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలో గడచిన రబీకి సంబంధించి 7.40 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కేవలం 24 గంటల వ్యవధిలోనే రూ. 1400 కోట్లు మేర చెల్లించారు. మరో రూ. 284 కోట్లు బకాయి పడింది. గతేడాది కంటే లక్ష టన్నుల ధాన్యం అధికంగా కొనుగోలు చేశారు. గడచిన అంచనాల ఆధారంగా ప్రభుత్వం సొమ్ములను సిద్ధం చేసుకుంది. జిల్లాలో 6.40 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినంత వరకు 24 గంటల వ్యవధిలోనే రైతులకు సొమ్ములు చెల్లించారు. అంచనాలకు మించి ధాన్యం ఉత్పత్తి కావడంతో పౌర సరఫరాల కార్పొరేషన్‌ లెక్క తప్పింది. ప్రభుత్వం సకాలంలో సొమ్ములను సమకూర్చలేకపోయింది. కొద్ది మొత్తంలోనే పౌర సరఫరాల కార్పొరేషన్‌ చతికిల పడింది. తాజాఆ రూ.112 కోట్లు జమ చేశారు. మిగిలిన సొమ్ముల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.

Updated Date - Jul 03 , 2025 | 12:40 AM