ప్రధాని మోదీ సభకు వెళ్లి వస్తూ ఉద్యోగి మృతి
ABN, Publish Date - May 03 , 2025 | 12:12 AM
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అమరావతిలో శంకుస్థాపన కార్యక్ర మానికి ప్రజలను బస్సులో తీసుకువెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదంలో ఒక ఉద్యోగి మృతి చెందారు.
కైకరంలో రోడ్డు ప్రమాదం..
ఏలూరు ఆస్పత్రికి తరలించేలోపు మృతి
ఏలూరు క్రైం, మే 2 (ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అమరావతిలో శంకుస్థాపన కార్యక్ర మానికి ప్రజలను బస్సులో తీసుకువెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదంలో ఒక ఉద్యోగి మృతి చెందారు. మార్గమధ్యలో టీ తాగడానికి బస్సు ఆగడం రోడ్డు దాటుతున్న ఆ బస్సు ఇన్‌చార్జి, డీఆర్‌డీఎ ఉద్యోగిని వ్యాను ఢీ కొనడంతో మృత్యువాత పడ్డారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా డీఆర్‌డీఏలో మల్కిపురం మండల క్లస్టర్ ఇన్‌ఛార్జిగా దేవళ్ల తిమ్మల నాగరాజు (50) ఉద్యోగం చేస్తున్నారు. ఆయన ఆ మండలం నుంచి డ్వాక్రా మహిళలను తీసుకుని బస్సు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తూ అమరావతిలోని ప్రధాని సభకు శుక్రవా రం వెళ్లారు. అక్కడ సభ ప్రాంగణం నిండిపోవడంతో లోపలికి వెళ్లడానికి అనుమతించలేదు. చివరకు సభ అయ్యే వరకూ బయటే ఉండి తిరిగి సాయంత్రం బయలుదేరారు. 5 గంటల సమయంలో ఉంగుటూరు మండలం కైకరం వద్ద రోడ్డు పక్కన టీ తాగడానికి బస్సును ఆపారు. అందరు టీ తాగుతుండగా నాగరాజు మూత్రవిసర్జన కోసం రోడ్డుదాటి వెళుతుండగా వ్యాన్ ఢీ కొంది. తీవ్ర గాయాలైన అతడిని ఏలూరు ప్రభుత్వాసు పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. ఏలూరు తహసీల్దార్ ఎన్ శేషగిరిరావు హుటాహుటిన ఆసుపత్రికి వచ్చి పరిస్థితిని అడిగి తెలుసుకుని ఉన్నతాధికారులకు తెలియజేశారు. నాగరాజు మరణంపై ఆసుపత్రి వైద్యులు ఎమ్మెల్సీగా నమోదు చేసి ఆసుపత్రి అవుట్‌పోస్టు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
Updated Date - May 03 , 2025 | 12:12 AM