ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కాశీలో వృద్ధ దంపతుల ఆత్మహత్య

ABN, Publish Date - Jun 21 , 2025 | 12:44 AM

శివుడి సన్నిధిలోనే మరణం పొందాలని భావించారా దంపతులు. అను కున్నట్లుగానే వారు వారాణసి వెళ్లి మానస సరోవర్‌ ఘాట్‌ వద్ద బలవన్మరణానికి పాల్పడ్డారు.

వారాణసిలో ఆత్మహత్య చేసుకున్న దంపతులు

16 రోజుల క్రితం కాశీ యాత్ర

మనుమలతో సంతోషంగా మాట్లాడి.. అంతలోనే బలవన్మరణం

వేంపాడులో విషాదం

కాళ్ల, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): శివుడి సన్నిధిలోనే మరణం పొందాలని భావించారా దంపతులు. అను కున్నట్లుగానే వారు వారాణసి వెళ్లి మానస సరోవర్‌ ఘాట్‌ వద్ద బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు, బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాళ్ల మండలం వేంపాడుకు చెందిన వృద్ధ దంపతులు వీరమల్లు గంగారావు(75), అప్పా యమ్మ(70). వారి కుమారుడు, ఇద్దరు కుమార్తెలకు వివాహాలు కావడంతో వేర్వేరు ప్రాంతాల్లో ఉంటు న్నారు. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా, కుటుంబ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవని చెబుతారు. ఎప్పటి నుంచో కాశీకి వెళ్లాలని ఉందని, అక్కడే శేష జీవితం గడుపుతూ శివైక్యం చెందాలని వారు ఇటీవల బంధువులు, స్నేహితుల వద్ద చెబుతుండేవారు. 16 రోజుల క్రితం కొంతమంది యాత్రికులతో కాశీ వెళ్లారు. ఇన్ని రోజులు గడిచినా రాకపోయే సరికి గురువారం రాత్రి పెద్ద కుమార్తె తల్లిదండ్రులకు ఫోన్‌ చేయడంతో తమకు ఇక్కడ బాగానే ఉందని, ఇక్కడే ఉండిపోతామని చెప్పారు. గంటకుపైగా పిల్లలు, మనుమల తో సంతోషంగా మాట్లాడారు. ఇది జరిగిన కాసేపటికే మానస సరోవర్‌ ఘాట్‌లో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. అక్కడ పోలీసులు వీరి సెల్‌ఫోన్‌ ఆధారంగా కాళ్ల మండలం వేంపాడుకు చెందిన దంపతులుగా గుర్తించి భీమవరం పోలీ సులకు సమాచారం ఇచ్చారు. గంటకుపైగా ఫోన్‌లో పిల్లలు, మనుమలతో సంతోషంగా మాట్లాడిన దంపతులు చనిపోయారని తెలియడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. శివైక్యం చెందుతామంటూ చెబితే నమ్మలేకపోయామని, ఇలా బలవన్మరణానికి పాల్పడి శివైక్యం చెందడంపై కన్నీటి పర్యంతమయ్యారు. మరణవార్త తెలిసిన కుటుంబ సభ్యులు ఆ శివయ్య సన్నిధిలోనే దహన సంస్కారాలు పూర్తి చేసి తల్లిదండ్రుల ఆఖరి కోరిక తీర్చేందుకు వారాణసి బయలుదేరారు.

Updated Date - Jun 21 , 2025 | 12:44 AM