గిరిజనులకు పథకాలు అందించే బాధ్యత అధికారులదే
ABN, Publish Date - Jun 29 , 2025 | 12:16 AM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలు గిరిజనులందరికి అందించే బాధ్యత అధికారులదేనని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ప్రాజెక్టు అధికారి రిషబ్ చతుర్వేది అన్నారు.
బుట్టాయగూడెం, జూన్ 28(ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలు గిరిజనులందరికి అందించే బాధ్యత అధికారులదేనని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ప్రాజెక్టు అధికారి రిషబ్ చతుర్వేది అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేం దుకు ఈనెల 15 నుంచి 30వ తేదీ వరకు జరుగుతున్న ‘దార్తి అభ జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్’ అవగాహన గ్రామసభలు బుట్టాయగూడెం మండలం ముంజులూరు, పోలవరం మండలం చింతపల్లి, కల్లుమా మిడిలో జరగ్గా ఆయన పాల్గొని మాట్లాడారు. సంక్షేమ పథకాలు అందుతున్న తీరును గిరిజన లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. జన్మన్ అభియాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించి గర్భిణీలకు పౌష్టికాహారాన్ని అందజేశారు. అనంతరం కెఆర్ పురం ఐటిడిఎ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో పిఎం జన్మన్ పథకంపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమాల్లో పివో కె.రామలు నాయక్, ఆర్డీవో ఎంవీ రమణ, ఐసీడీఎస్ పీడీ పి.శారద, పలు శాఖల అధికారులు, సిబ్బంది ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Updated Date - Jun 29 , 2025 | 12:16 AM