ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఉద్యాన యూనివర్సిటీ ఉద్యోగులకు జీతాలు లేవు!

ABN, Publish Date - Apr 17 , 2025 | 12:06 AM

డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వ విద్యాలయంలో ఉద్యోగుల ఆకలి కేకలు అధికారులకు వినబడడం లేదు. అధ్యాపకులు, సీనియర్‌ ఉద్యోగులు సైతం వాయిదాల పద్ధతిలో జీతాలు అందుకుంటున్నారు.

అధ్యాపకులకు వాయిదా చెల్లింపులు

ఉద్యోగులకు పెండింగ్‌

ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది పరిస్థితి దయనీయం

డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వ విద్యాలయంలో ఉద్యోగుల ఆకలి కేకలు అధికారులకు వినబడడం లేదు. అధ్యాపకులు, సీనియర్‌ ఉద్యోగులు సైతం వాయిదాల పద్ధతిలో జీతాలు అందుకుంటున్నారు. ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది పరిస్థితి మరింత దయనీయం. నెలల తరబడి వేతనాలు అందక పూట గడవని స్థితిలో ఉన్నారు. ఉద్యోగులతో పాటు శాస్త్రవేత్తలకు వేతనాలు, పరిశోధనా విద్యార్థులకు (పీహెచ్‌డీ) స్టైఫండ్‌ అందడం లేదు.

తాడేపల్లిగూడెం రూరల్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): ప్రతిష్టాత్మక డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వ విద్యాలయ సిబ్బంది వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిధుల విడుదలలో జాప్యం, సిబ్బం ది అలసత్వంతో ఉద్యోగులు ఇబ్బంది పడగా పరిశోధనా విభాగం కుంటుపడింది. కూటమి ప్రభుత్వం రాగానే అడ్డదారిలో ఉప కులపతిగా నియమితులైన జానకిరామ్‌ను విధుల నుంచి తొలగించారు. సీనియారిటీ ప్రాతిపదికన ఇన్‌ చార్జ్‌ ఉప కులపతిని నియమిం చారు. విశ్వ విద్యాలయ సిబ్బంది అలసత్వంతో నేటికి గాడిన పడకపోగా చివరికి రెగ్యులర్‌ ఉద్యోగులకు (శాస్త్ర వేత్తలు, టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌, అసిస్టెంట్‌) జీతాలు అందించలేని దుస్థితికి చేరింది.

ప్రభుత్వం బడ్డెట్‌ కేటాయించినా..

ప్రభుత్వం బడ్డెట్‌ కేటాయించినా సకాలంలో ట్రెజరీకి జీతాల బిల్లులు పంపకపోవడంతో ఏప్రిల్‌లో రెగ్యులర్‌ ఉద్యోగులు వాయిదా చెల్లిం పులతో చెల్లింపులతో సరిపెట్టుకున్నారు. ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది పరిస్థితి మరి దయనీయంగా మారింది. సుమారు నాలుగు నెలల నుంచి వారి వేతనాలపై లెక్కపత్రం లేకుండా పోయింది. ముఖ్యంగా సెక్యూరిటీ నుంచి అటెండర్‌ పోస్టుల వరకూ అందరూ సుమారు 400 మందికి 3 నెలల జీతాలు అందక ఇంటి అవసరాలకు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. పేరుగొప్ప ఉరుదిబ్బ అన్న చందంగా వర్సిటీ ఉద్యోగుల పరిస్థితి ఉందని సిబ్బంది పెదవి విరుస్తున్నారు.

ఒక నెల ఇస్తే.. మరో నెల ఇవ్వరు

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాల చెల్లింపులో అయోమయం నెలకొంది. గత సంవత్సరం డిసెంబర్‌ వరకూ జీతాలు అందుకున్నారు. తరువాత జనవరి జీతం లేకపోవడంతో బడ్జెట్‌ ఇబ్బంది వస్తుందిలే అని సరిపెట్టుకున్నారు. తర్వాత ఫిబ్రవరి జీతాలు అందాయి. మళ్లీ మార్చి వేతనాలు లేవు. సిబ్బంది జీతాల చెల్లింపు విభాగంలో క్రమపద్ధతి లేకుండా వ్యవహరిస్తు న్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శాంక్షన్‌, నాన్‌ శాంక్షన్‌ మెలిక

గత వైసీపీ ప్రభుత్వంలో పాలకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, సిబ్బందిని ఇష్టా నుసారం నియమించుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై యూనివర్సిటీ ముఖ్య అధి కారులు ప్రభుత్వానికి సరైన వివరాలు అందిం చారో లేదో కానీ ఆ ఇబ్బంది వల్ల శాంక్షన్‌ పోస్టులకే బడ్జెట్‌ విడుదల చేస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీనితో ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది వేతనాల కోసం ఇంకెన్ని నెలలు ఎదురుచూడాల ని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పీహెచ్‌డీలకు బకాయి

యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్న వారి స్టైఫండ్‌ బకాయిలు పేరుకుపోయాయి. పీహెచ్‌డీలకు ప్రతీ నెలా చెల్లింపులు లేవు. కొందరు విద్యా సంబంధిత అవసరాలు, వారి ఖర్చులకు స్టైఫండ్‌ ఆధారం. వారి ఎరియర్స్‌ చెల్లింపుల మాటే వినిపించడం లేదు.

Updated Date - Apr 17 , 2025 | 12:06 AM