ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కొత్త దుకాణం.. పాత సరుకు!

ABN, Publish Date - May 31 , 2025 | 12:51 AM

వచ్చే నెల ఒకటో తేదీ నుంచి జారీ చేస్తారనుకున్న స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ఇప్పటికి లేనట్లే. పక్కాగా రేషన్‌ దుకాణాల్లో నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంటాయన్నది వాయిదానే.

అట్టహాసంగా ఏర్పాట్లు చేయాల్సిందిగా డీలర్లకు సంకేతాలు

ప్రస్తుతానికి స్మార్ట్‌కార్డుల జారీలో తీవ్ర జాప్యం

బియ్యం, పంచదార మినహా కొత్త సరుకులు లేనట్లే

వచ్చే నెల ఒకటో తేదీ నుంచి జారీ చేస్తారనుకున్న స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ఇప్పటికి లేనట్లే. పక్కాగా రేషన్‌ దుకాణాల్లో నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంటాయన్నది వాయిదానే. గత ఆరు నెలల మాదిరిగానే ఈసారి బియ్యం, పంచదార మినహా కొత్తగా కందిపప్పు, ఇతర సరుకులు రానట్లే. కార్డుల్లో తీసివేతలు, కూడికలు సాగుతున్న తరుణంలో ఇప్పటికిప్పుడు కొత్త రేషన్‌కార్డుల జారీలో సర్కారు ఆచితూచి చేస్తోంది.

( ఏలూరు– ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

చాన్నాళ్లుగా కొత్త రేషన్‌కార్డుల కోసం వేలాది మంది ఎదురుచూస్తున్నారు. గత నెలలో కొత్త రేషన్‌కార్డుల జారీకి సానుకూలంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ సంకేతాలు ఇచ్చింది. కార్డుల్లో తొలగింపులు, చేరికలకు చర్యలు తీసుకుంటా మని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రకటిం చారు. అంతా సంబరపడుతూ సచివాలయాల వైపు పరుగులు తీశారు. తొలగింపులే కాదు ఉన్న రేషన్‌ కార్డుల్లోంచి తొలగించి తమ పేరిట కొత్త రేషన్‌ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ లోపే వివాహ నమోదు పత్రం ఉండాలని ప్రచారం సాగి రచ్చకు దారి తీసింది. పౌర సరఫరాల విభాగం అంటువంటిదేమీ లేదని తాజాగా స్పష్టం చేసింది.

జగన్‌ జమానాలో కొంతమంది పేర్లు చేర్చ డం, తొలగించడం వంటి చర్యలు తీసుకున్నా ఆకస్మికంగా పౌరసరఫరాల శాఖ ఆన్‌లైన్‌ ప్రక్రి యను నిలిపివేసింది. అప్పట్లో వలంటీర్ల దయా దాక్షిణ్యాల మీదే కొత్త కార్డుల జారీ, పేర్లు తొల గింపు వంటివి చోటు చేసుకున్నాయి. దీనికి తోడు ప్రింటెడ్‌ రేషన్‌ కార్డులో కుటుంబంలోని పూర్తి పేర్లు, వ్యక్తులు పేర్లు కొన్నింటిలో లేక పోవడం, కేవలం ఆన్‌లైన్‌కే పరిమితం కావడం తో వివిధ సర్టిఫికెట్ల జారీలో ఆటంకాలు ఏర్ప డ్డాయి. ఈ మధ్యకాలంలో కుటుంబాల్లో కొత్తగా పెళ్లి అయిన వారితో పాటు మిగతా వారు తాము విడిపోతా మని కొత్తగా రేషన్‌కార్డు ఇవ్వాలని కార్యాలయాల చుట్టూ తిరిగారు. రేషన్‌ కార్డుల్లో మార్పులు, చేర్పులతో సహా జగన్‌ బొమ్మతో వున్న కార్డును తొలగించి ఆ స్థానంలో స్మార్ట్‌కార్డు జారీకి ప్రభుత్వం ఉత్తర్వు లు ఇచ్చింది. ఇదంతా ఈ నెలాఖరు నాటికే పూర్తి చేసి జూన్‌ నుంచి జారీ ప్రారంభిస్తామని ప్రకటించారు. అయితే కొత్త రేషన్‌కార్డుల కోసం ఒక్కొక్క జిల్లాలో 3 వేల కేటుంబాలకు తక్కు వగా కాకుండా అభ్యర్థనలు సమర్పించారు. ఏలూరు జిల్లాలోనే 3,265 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈక్రమంలో అందరూ ఊహిస్తు న్నట్లుగా జూన్‌ ఒకటి నుంచే స్మార్ట్‌ కార్డులు జారీ అయ్యే అవకాశాలు లేవు. దీనికి తోడు కార్డుల్లో పేర్లు తొలగింపు, చేరికలకు తుది గడువు అంటూ ఏది లేదని, ఇదంతా నిరంతర ప్రక్రియ అని సవరణ ప్రకటన చేశారు.

రేపటి నుంచి రేషన్‌ దుకాణాలు

రాష్ట్ర ప్రభుత్వం తిరిగి పాత పద్ధతిలోనే రేషన్‌ దుకాణాలు రేపటి నుంచి తిరిగి తెరు చుకునేలా అన్ని ఏర్పాట్లు చేసింది. ఏలూరు జిల్లాలో 1,123, పశ్చిమలో 1,052 దుకాణాలను ప్రారంభిస్తారు. వీటి ద్వారానే వినియోగదారులందరికీ సరుకులు అందజే స్తారు. ఈ–పోస్‌ యంత్రాలను డీలర్లకు అందజేశారు. వినియోగదారుల సంఖ్యను బట్టి కావాల్సిన సరుకు లను శుక్రవారం కేటాయించారు. శనివారం నాటికే సరుకంతా దుకాణాలకు చేరేలా చర్యలు తీసుకో వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు కొంతమందికి అనువుగా వున్న రేషన్‌ సరఫరా వాహనాలను ఇప్పటికే తొలగించి వాటిలో వున్న ఎలకా్ట్రనిక్‌ కాటా, బయోమెట్రిక్‌ యంత్రం, ఇతరత్రా రెవెన్యూ అధికారులు స్వాధీన పర్చుకున్నారు. వాటినే డీలర్లకు అందించారు. సాధ్యమైనంత మేర రేషన్‌ దుకాణాలు అన్నింటిని ఆదివారం ఆట్టహాసంగా ప్రారంభించాలని అంతర్గత ఆదేశాలు వెలువడ్డాయి. కూటమి పక్షాలకు చెందిన నేతల ద్వారా ఆయా రేషన్‌ దుకాణాలు ప్రారంభించా లని సూచించారు. ఆ మేరకు ఇప్పుడు డీలర్లంతా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

కొత్త సరుకంటూ లేదు

ఎప్పటి మాదిరిగానే ఈసారీ బియ్యం, పంచ దార తోనే సరిబెట్టబోతున్నారు. గత ఫిబ్రవరిలో కందిపప్పు, మైదా అదనంగా అందించినా ఆ తర్వాత నెల నుంచి వాటి సరఫరా నిలిపివేశారు. వినియో గదారులంతా కందిపప్పు తక్కువ రేటుకు కార్డుపై అందించాలని అప్పటి నుంచి అభ్యర్థిస్తూ వచ్చారు. కానీ సర్కారు ఆ వైపు తొంగి చూడలేదు. దీనికి తోడు రేషన్‌ దుకాణాల్లో విలేజ్‌ మాల్స్‌ తలపించేలా నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచుతామని మరో ప్రకటన చేశారు.

ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి

రేషన్‌ కార్డులు – 6,20,146 – 5,58,019

రేషన్‌ షాపులు – 1,123 – 1,052

గతంలో వాహనాలు – 395 – 356

Updated Date - May 31 , 2025 | 12:51 AM