ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పాస్‌ పుస్తకాలపై రాజముద్ర

ABN, Publish Date - Jul 25 , 2025 | 12:27 AM

రైతులకు ప్రభుత్వ రాజముద్ర ముద్రించిన భూ యాజమాన్య హక్కు పత్రాలు (పట్టాదారు పాస్‌ పుస్తకాలు) అందనున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం రైతులకు చేసిందేమి లేకపోయినా.. ప్రచార ఆర్భాటా లతో రైతులకిచ్చే పాస్‌ పుస్తకా లపై అత్యుత్సాహంతో జగన్‌ బొమ్మతో ముద్రించి కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం చేశారు.

నేడు నూతన పట్టాదారు పాస్‌ పుస్తకాలు.. .నాడు జగన్‌ బొమ్మతో అలా..

జగన్‌ బొమ్మ తొలగింపు

జిల్లాకు కొత్త పట్టాదారు పాస్‌ పుస్తకాలు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

రైతులకు ప్రభుత్వ రాజముద్ర ముద్రించిన భూ యాజమాన్య హక్కు పత్రాలు (పట్టాదారు పాస్‌ పుస్తకాలు) అందనున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం రైతులకు చేసిందేమి లేకపోయినా.. ప్రచార ఆర్భాటా లతో రైతులకిచ్చే పాస్‌ పుస్తకా లపై అత్యుత్సాహంతో జగన్‌ బొమ్మతో ముద్రించి కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం చేశారు. రైతు పొందే హక్కు పత్రాలపై జగనన్న భూరక్ష పథకం కింద అంటూ ముద్రించి మరీ పంపిణీ చేశారు. అయితే టీడీపీ ప్రభుత్వం వాటికి చెక్‌ పెడుతూ పాత విధానం ప్రకారమే రాజముద్రతో పాస్‌ పుస్తకాలు ముద్రించి అందించాలని ఆదేశాలను జారీ చేసింది. తాజాగా ఆగస్టు నాటికి రాష్ట్రంలో రైతులందరికి తొలి విడతగా 21.86 లక్షల పట్టాదారు పాస్‌ పుస్తకాలు ప్రభుత్వ రాజముద్రతో అందించాలని సీఎం చంద్రబాబు ఇటీవల జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో నిర్ణయించారు. జిల్లాలో మ్యుటేషన్లు పూర్తయిన భూములకు సంబంధించి ప్రభుత్వ రాజముద్రతో ముద్రించిన 22,670 పట్టాదారు పుస్తకాలు కలె క్టరేట్‌కు గురువారం చేరుకున్నాయి. ఆర్డీవోల పర్యవేక్షణలో తహసీల్దార్‌ కార్యాలయాల సిబ్బంది గ్రామాల వారీగా వచ్చిన పుస్తకాలను కట్టలు కట్టుకుని తీసుకెళ్తున్నారు. తప్పులకు తావు లేకుండా ఎల్‌పీఎంలు, అన్ని వివరాలతో పాస్‌పుస్తకాలు ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. వీటిని త్వరలోనే అందివ్వనున్నారు. జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టు కింద రెండు విడ తలుగా చేపట్టి భూముల రీ సర్వేకు సంబంధించి కూడా పట్టాదార్‌ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. దీనికి ఆన్‌లైన్‌లో సమగ్ర వివరాలను జేసీ, తహసీల్దార్‌ లాగిన్‌లతో నూతన పట్టాదారు పుస్తకాలకు కసర త్తులు జరగుతున్నాయి. మరోవైపు జాయింట్‌ ఎల్‌పీఎంల సమస్యలను ఒక కొలిక్కి తేవడంతో రైతులు పథకాల లబ్ధిని అందుకోనున్నారు.

Updated Date - Jul 25 , 2025 | 12:27 AM