గస్తీ ముమ్మరం
ABN, Publish Date - Jun 20 , 2025 | 12:38 AM
ప్రజలకు ఉత్తమ సేవలందించడమే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖకు కేటాయించిన మోటార్ సైకిళ్లను ఎస్పీ అద్నాన్ నయీం అస్మి గురువారం ప్రారంభించారు.
ట్రాఫిక్ నియంత్రణ, శక్తి బృందాలకు 16 నూతన వాహనాలు
మోటార్ సైకిళ్లను ప్రారంభించిన ఎస్పీ అద్నాన్ నయీం అస్మి
భీమవరం క్రైం, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు ఉత్తమ సేవలందించడమే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖకు కేటాయించిన మోటార్ సైకిళ్లను ఎస్పీ అద్నాన్ నయీం అస్మి గురువారం ప్రారంభించారు. ఒక రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌తోపాటు 15 టీవీఎస్ అపాచీ మోటార్ సైకిళ్లు ఉన్నాయి. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, మహిళలు, బాలికల భద్రతకు దోహదపడే శక్తి బృందాల గస్తీ సమర్ధవంతంగా నిర్వహించేందుకు ఈ వాహనాలను వినియోగిస్తారు.
ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ పోలీసు శాఖలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నూతనంగా జిల్లాకు కేటాయించిన వాహనాలతో జిల్లా ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన పోలీసు సేవలను అందించడానికి ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది కృషి చేయాలన్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై తక్షణమే స్పందించాలని, శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడకుండా నిబద్ధతతో పనిచేయాలని పోలీసు సిబ్బందిని ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ వి.భీమారావు, ఆర్మ్‌డ్ రిజర్వ్ డీఎస్పీ ఎంవీవీ సత్యనారాయణ, భీమవరం డీఎస్పీ ఆర్.జయసూర్య, నరసాపురం డీఎస్పీ జి.శ్రీవేద, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ వి.పుల్లారావు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ దేశంశెట్టి వెంకటేశ్వరరావు, మహిళా ఇన్‌స్పెక్టర్ అహ్మదున్నీసా, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jun 20 , 2025 | 12:38 AM