అరుణాచలం రైలుకు పచ్చ జెండా
ABN, Publish Date - Jul 10 , 2025 | 12:14 AM
నరసాపురం – తిరువణ్ణామలై (అరుణాచలం) ప్రత్యేక రైలు రెగ్యులర్ చేయిస్తామని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ చెప్పారు.
ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ
నరసాపురం/భీమవరం టౌన్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): నరసాపురం – తిరువణ్ణామలై (అరుణాచలం) ప్రత్యేక రైలు రెగ్యులర్ చేయిస్తామని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ చెప్పారు. నరసాపురం రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరే తిరువణ్ణామలై ఎక్స్‌ప్రెస్‌కు విప్ నాయకర్‌తో కలిసి బుధవారం ఆయన పచ్చజెండా ఊపారు. ఇద్దరూ భీమవరం వరకు రైలులో ప్రయాణించారు. భీమవరంలో ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు వారికి స్వాగతం పలికారు. పాలకొల్లు, భీమవరం, ఆకివీడు స్టేషన్లలో కూటమి నాయకులు పెద్ద ఎత్తున్న రైలుకు స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి వర్మ మాట్లాడుతూ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు ప్రాంత ప్రజలు అరుణాచలం వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారానికి మూడుసార్లు నడిపేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. నరసాపురం– చెన్నై వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు అనుమతి రైల్వే బోర్డు వద్ద పెండింగ్‌లో ఉందని, నరసాపురం స్టేషన్‌లో పనులు పూర్తికాగానే ఈ రైలు ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వ విప్ నాయకర్ మాట్లాడుతూ ప్రతిపాదనలో ఉన్న రైళ్లను పట్టాలెక్కించేందుకు కేంద్ర మంత్రి కృషి చేయాలన్నారు. పొత్తూరి రామరాజు, రైల్వే ఏడీఆర్‌ఎం కె.శ్రీనివాసరావు, డీసీఎం రాంబాబు, రైల్వే బోర్డు సభ్యుడు నడిపూడి పండు, ఎస్‌ఎం మధుబాబు, బీజేపీ జిల్లా ఆధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, డీఆర్‌యూసీ సభ్యుడు జక్కంపూడి కుమార్, బీజేపీ నరసాపురం పార్లమెంట్ కన్వీనర్ సుభాష్ రాజు, పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 10 , 2025 | 12:14 AM