బండి ముత్యాలమ్మ జాతర ప్రారంభం
ABN, Publish Date - May 25 , 2025 | 11:52 PM
ప్రతీ మూడేళ్లకు ఒకసారి నిర్వహించే ముత్యాలపల్లి బండి ముత్యాలమ్మ అమ్మవారి జాతర ఆదివారం ప్రారంభ మైంది. జాతర సంప్రదాయం ప్రకారం ఈనెల 4న అమ్మవారిని పూరిపాక వేసి నిలబెట్టారు.
మొగల్తూరు, మే 25(ఆంధ్రజ్యోతి) : ప్రతీ మూడేళ్లకు ఒకసారి నిర్వహించే ముత్యాలపల్లి బండి ముత్యాలమ్మ అమ్మవారి జాతర ఆదివారం ప్రారంభ మైంది. జాతర సంప్రదాయం ప్రకారం ఈనెల 4న అమ్మవారిని పూరిపాక వేసి నిలబెట్టారు. ఈనెల 7వ తేదీ రాత్రి గ్రామ కరణం కుటుంబ సభ్యులు చెన్నాప్రగడ వంశస్తులు అఖండ జ్యోతి వెలిగించి జాతర ప్రారంభించారు. ఈనెల 8 నుంచి ఆలయ పరిధిలో నాలుగు పంచాయతీలలోనూ ప్రతీ ఇంటికి అమ్మవారి అఖండ జ్యోతిని తీసుకువెళుతున్నారు. జాతర సందర్భంగా ఆలయ పరిధిలో భారీ స్వాగతద్వారాలు, విద్యుత్ దీపాలంకరణలతో భారీ పందిళ్లు ఏర్పాటు చేశారు. అమ్మవారి జాతర మహోత్సవాలు ఈనెల 25 నుంచి వచ్చే నెల 8 వరకు.. రోజుకు రెండు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ ఆదివారం ప్రారంభించారు. తొలిరోజు శివలీలలు హరికథ కాలక్షేపం, రాత్రి గణపతి మహత్స్యం నాటకాన్ని ప్రదర్శించారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ కడలి మాణిక్యాలరావు, ఉత్సవ కమిటీ చైర్మన్ కొల్లాటి బాలకృష్ణ, పాలకమండలి, ఉత్సవ కమిటీ సభ్యులు, ఈవో డి.రామకృష్ణంరాజు ఆలయ సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Updated Date - May 25 , 2025 | 11:52 PM