మా గోడు పట్టించుకోండి..!
ABN, Publish Date - Jul 16 , 2025 | 12:54 AM
మునిసిపల్ ఇంజనీరింగ్ కార్మికులు దీర్ఘకాలం గా సమస్యలు పరిష్కారం కాక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.
వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేసింది
జీతాలు పెంచాలి
సమస్యలు పరిష్కరించాలి
మునిసిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ఆవేదన
ఏలూరుటూటౌన్, జూలై 15(ఆంధ్రజ్యోతి): మునిసిపల్ ఇంజనీరింగ్ కార్మికులు దీర్ఘకాలం గా సమస్యలు పరిష్కారం కాక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని, ఆరేళ్లుగా ఒక్కొ కార్మికుడు లక్షలాది రూపాయలు నష్టపో యామని వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తున్న కార్మికుల సమస్య లు పరిష్కారం కాలేదని వాపోతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ 75 రోజులుగా నగర పాలక సంస్థ, మునిసిపల్ కార్యాలయాల వద్ద మధ్యాహ్న భోజన సమయంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తమ సమస్య లు పరిష్కరించాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుం టున్నారు. అరకొర వేతనాలతో కుటుంబాన్ని పోషించుకోవడం చాలా కష్టతరమవుతుందని కార్మికులు ఆవేదన చెందుతున్నారు.
అప్పట్లో 17 రోజులు సమ్మె
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాల నలో కల్లబొల్లి కబుర్లతో కాలం వెళ్లబుచ్చారే తప్ప ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. వైసీపీ హయాంలో తమ సమస్యలు పరిష్కరించాలంటూ 17రోజుల పాటు కార్మికు లు సమ్మె నిర్వహించారు. సమ్మెతో దిగివచ్చిన వైసీపీ ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి కమిటీలు వేసి పరిష్కరించకుండానే ప్రభుత్వం వెళ్లిపోయింది. కూటమి ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరిస్తుందని కార్మికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
వేతనాలు పెంచాలి
జీవో నెంబర్ 36 ప్రకారం స్కిల్డ్ వర్కర్‌కు రూ.29,500, సెమి స్కిల్డ్ వర్కర్లకు రూ.26500, అన్‌స్కిల్డ్ వర్కర్లు రూ.21000 జీతాలు చెల్లించాలి. కానీ కేవలం నెలకు రూ.15వేలు మాత్రమే వేతనాలు ఇస్తున్నారు. పారిశుధ్య కార్మికులకు రూ.21వేలు ఇస్తున్నారు. వారికంటే రూ.6వేలు ఇంజనీరింగ్ కార్మికులకు తక్కువగా వేతనాలు చెల్లిస్తున్నారు. గత ఆరు సంవత్స రాలుగా ఒక్కొ కార్మికుడు రూ.4,50,000 నష్టపోయారు. కనీసం పారిశుధ్య కార్మికులకు ఇచ్చిన రూ.21వేలు కూడా ఇవ్వడంలేదని ఇంజనీరింగ్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు డ్యూటీ సమయాలు ఉండవని ఎప్పుడూ ఎక్కడ ఎటువంటి అంతరాయం కలిగిన తక్షణమే వెళ్లి ఆ సమస్యను పరిష్కరిస్తామని అయినప్పటికి ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని కార్మికులు తీవ్ర మనోవేదన చెందుతున్నారు.
జిల్లాలో మునిసిపల్ కార్మికులు
ఏలూరు నగర పాలక సంస్థలో పర్మినెంట్ ఉద్యోగులు 60మంది, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు 250 మంది, నూజివీడులో 80 మంది, చింతలపూడిలో 20మంది, జంగారెడ్డిగూడెంలో 30మంది, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు.
జీతాలు పెంచాలి
అరకొర జీతాలతో కుటుంబాలను పోషించుకోలేకపోతున్నాం. ప్రస్తుత రోజుల్లో నెలకు రూ.15వేలు జీతంతో కుటుంబంలో నలుగురు ఎలా బతకాలి. ప్రభుత్వం జీవోల ప్రకారం జీతాలు పెంచి ఎరియర్స్‌తో సహా చెల్లించాలి.
ఎ.అప్పలరాజు, మునిసిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి
దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలి
రాత్రింబవళ్లు కష్టపడుతున్నాం. దీర్ఘకాలిక డిమాండ్లు తక్షనమే పరిష్కరించాలి. స్కిల్డ్, అన్‌స్కిల్డ్, సెమిస్కిల్డ్ వేతనాలు సవరించాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చండి.
బి.నారాయణరావు, అసోసియేషన్ ట్రెజరర్
Updated Date - Jul 16 , 2025 | 12:54 AM