విపత్తులో భయం వద్దు
ABN, Publish Date - May 15 , 2025 | 01:13 AM
ప్రమాదాలు, విపత్తుల సమయంలో భయపడవద్దని, నివారణ చర్యలపై అవగాహన కలిగి ఉండా లని కలెక్టర్ నాగరాణి అన్నారు.
ప్రమాద నివారణపై మాక్ డ్రిల్
స్వయంగా పాల్గొన్న కలెక్టర్ నాగరాణి, ఎస్పీ అస్మీ
భీమవరం క్రైం, మే 14 (ఆంధ్రజ్యోతి): ప్రమాదాలు, విపత్తుల సమయంలో భయపడవద్దని, నివారణ చర్యలపై అవగాహన కలిగి ఉండా లని కలెక్టర్ నాగరాణి అన్నారు. రాష్ట్ర విపత్తుల సహాయ బలం (ఏపీఎస్ డీఆర్‌ఎఫ్), అగ్నిమాపక, పోలీసు, రెవెన్యూ, వైద్య శాఖలు సంయుక్తంగా బుధవారం కొత్త బస్టాండ్ ఆవరణలో మాక్ డ్రిల్‌తో ప్రజలకు అవగాహన కల్పించారు. కలెక్టర్ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం ప్రయోగాత్మకంగా ప్రమాద నివారణ చర్యలు వివరించారు. బాంబు బ్లాస్ట్, అగ్ని ప్రమాదం, గ్యాస్ లీకేజ్, భవనాలు కూలిన సందర్భంలో సురక్షితంగా బయటపడే విధానాలు మాక్ డ్రిల్‌తో చూపారు. మాక్ డ్రిల్ ఆద్యంతం జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ఎ.శ్రీనివాసరావు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా ప్రజలకు వివరించారు. డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, ఏఎస్పీ వి.భీమారావు, ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎస్‌డిఆర్‌ఎఫ్ కమాండెంట్ ఎం.నాగేంద్రరావు, రవాణా అధికారి ఎన్‌వీఆర్ వరప్రసాద్, డీఎస్పీ ఎం.మెహన్‌రావు, మునిసిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - May 15 , 2025 | 01:13 AM