ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కొల్లేరు ప్రజలను సుప్రీం కోర్టు గుర్తించింది

ABN, Publish Date - Apr 21 , 2025 | 12:06 AM

కొల్లేరులో ప్రజలు నివశిస్తున్నారన్న విషయం సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళ్లి శాశ్వత పరిష్కారానికి ఒక అడుగు ముందుకు వేశామని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌

త్వరలో సీఈసీ కమిటీ కొల్లేరు గ్రామాల్లో పర్యటన

12 వారాల్లో కొల్లేరువాసుల జీవనశైలిపై నివేదిక

ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌

కైకలూరు, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): కొల్లేరులో ప్రజలు నివశిస్తున్నారన్న విషయం సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళ్లి శాశ్వత పరిష్కారానికి ఒక అడుగు ముందుకు వేశామని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ అన్నారు. కొల్లేరు ప్రజలతో ఆదివారం ఆయన సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో కొల్లేరులో ప్రజలు నివసిస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లామని, కొల్లేరు స్థితిగతులను ప్రజల జీవనవిధానంపై 12 వారాల్లో నివేదిక ఇవ్వాలని సెంట్రల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కమిటీ (సీఈసీ)ని కోరినట్లు తెలిపారు.

కొల్లేరు సాధనకు ప్రజలంతా ఐక్యతతో పార్టీలకతీతంగా కలిసి పనిచేయాలన్నారు. త్వరలో కొల్లేరులో సీఈసీ కమిటీ సభ్యులు పర్యటిస్తారని వారికి మన జీవనశైలిని, ప్రస్తుత స్థితిగతులను తెలియజేద్దామన్నారు. కొల్లేరు సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్ర బాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ చిత్త శుద్ధితో పనిచేస్తున్నారని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ అన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మె ల్సీ కమ్మిలి విఠలరావు, బలే ఏసురాజు, సైదు సత్యనారాయణ, ఘంటసాల వెంకటలక్ష్మి, చింతపల్లి వెంకటనారాయణ, పెన్మెత్స త్రినాథ రాజు, తేరా రమేష్‌బాబు, కొల్లి వరప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 21 , 2025 | 12:06 AM