ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రైతులకు ఆసరాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు : ఎమ్మెల్యే పత్సమట్ల

ABN, Publish Date - Jun 12 , 2025 | 12:27 AM

రైతుల కు ఆసరాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అన్నారు. ఏరువాక పౌర్ణమి పురస్కరించుకుని మండలంలో సీహెచ్‌.అగ్రహారంలో ఏరువాక సాగాలిరో అన్నో చిన్నన్న.. అంటూ రైతుల్ని అధికారుల్ని, కూటమి సభ్యుల్ని ఆనందంతో ముంచెత్తించారు.

సీహెచ్‌ అగ్రహారంలో దుక్కు పనులు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ధర్మరాజు

గణపవరం, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): రైతుల కు ఆసరాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అన్నారు. ఏరువాక పౌర్ణమి పురస్కరించుకుని మండలంలో సీహెచ్‌.అగ్రహారంలో ఏరువాక సాగాలిరో అన్నో చిన్నన్న.. అంటూ రైతుల్ని అధికారుల్ని, కూటమి సభ్యుల్ని ఆనందంతో ముంచెత్తించారు. ఈ సందర్భంగా జరిగిన కార్య క్రమంలో ఆయన మాట్లాడుతూ వర్షాలు సమృ ద్ధిగా కురవాలని రైతులంతా పంటలు అధిక దిగుబడులు సాధించాలని కోరుకుంటున్నా మన్నారు. ప్రతీ ఏటా జ్యేష్ట శుద్ధపౌర్ణమి రోజున ఏరువాక పౌరణమి పండుగ జరుపుకోవడం శుభపరిణామం అన్నారు. పొలాల్లోకి వెళ్లి ట్రాక్టర్‌ ద్వారా భూమి దుక్కిదున్నడం ప్రారంభించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌ సీజన్‌లో 2.08లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తు న్నామన్నారు. తాడేపల్లిగూడెం ఏడీఏ మురళీ కృష్ణ, ఏవో వైవీఎస్‌.ప్రసాద్‌, రాష్ట్ర క్షత్రియ కార్పోరేషన్‌ డైరెక్టర్లు ఇందుకూరి రామకృష్ణం రాజు, పొత్తూరి వాసురాజు, యాళ్ల సుబ్బారావు, టీడీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2025 | 12:27 AM