ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మిర్చి రైతు కన్నీరు!

ABN, Publish Date - May 13 , 2025 | 12:08 AM

మిర్చి పంటకు ధర లేక తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు, మూడేళ్ల క్రితం 2023 లో మిర్చిధరలు ఆకాశాన్ని తాకి లాభాల పంట కురిపించింది. క్వింటా మిర్చికి 24 వేల వరకు రైతు వద్దే కొనుగోలు చేయడంతో నికరంగా మంచిలాభాలే వచ్చాయి. వరుసగా రెండేళ్లు వైరస్‌, నల్లితెగులు సోకి దిగుబడులు గణనీయంగా పడిపోయాయి.

తగ్గిన దిగుబడులు.. ధరలు పతనం

ఎకరానికి రూ.లక్ష పైనే నష్టం

ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు

వేలేరుపాడు, మే 12 (ఆంధ్రజ్యోతి) : మిర్చి పంటకు ధర లేక తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు, మూడేళ్ల క్రితం 2023 లో మిర్చిధరలు ఆకాశాన్ని తాకి లాభాల పంట కురిపించింది. క్వింటా మిర్చికి 24 వేల వరకు రైతు వద్దే కొనుగోలు చేయడంతో నికరంగా మంచిలాభాలే వచ్చాయి. వరుసగా రెండేళ్లు వైరస్‌, నల్లితెగులు సోకి దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. ఈ ఏడాది తెగుళ్ల బెడదతో మిర్చి దిగుబడులు మరింత దారుణంగా పడిపోయాయి. మరోవైపు ధరలు సగానికి సగం పైనే పతనమయ్యాయి. గతేడాది, ఈ ఏడాది మిర్చి క్వింటా రూ.15 వేలు దాటలేదు. ఈ ఏడాది మొదట్లో క్వింటా రూ.13 వేల వరకు కొనుగోలు చేసిన వ్యాపారులు ఆ తర్వాత రూ.9వేలకు తగ్గించేశారు. చివరాకర్లో ఆ ధరలు మరింత పతనమై రూ.6 వేల నుంచి రూ.7 వేల లోపే క్వింటా మిర్చిని కొనుగోలు చేశారు.

ఎకరానికి 10–15 క్వింటాళ్ల దిగుబడులు

దిగుబడులు ఈ ఏడాది ఎకరానికి 10–15 క్వింటాళ్ల వరకు మాత్రమే దిగుబడులు వచ్చాయి. ధర ఉండి ఉంటే రైతులు ఎంతోకొంత ఒడ్డునపడేవారు. ధరలు, దిగుబడులు రెండు తగ్గడంతో రైతు పెట్టిన పెట్టుబడుల్లో సగం రాలేదు. ఒకవైపు ఎరువులు, పురుగుమందుల ధరలు ఆకాశాన్ని అంటుతుండగా కూలీల రేట్లు ఇతర పెట్టుబడులు గణనీయంగా పెరిగిపోయి ఎకరానికి రూ.3లక్షల వరకు పెట్టుబడి అయింది. వచ్చిన పంటను అమ్మగా అందులో సగం కూడా రాకపోవడంతో రైతులు ఎకరానికి రూ.లక్షకు పైనే నష్టపోయారు. గత రెండేళ్లలో మండలంలో మిర్చిసాగు 3 వేల ఎకరాలు పైనే సాగయ్యింది. ఇందులో అత్యధికం కౌలు రైతులే ఉన్నారు. ఇదిలా ఉంటే దళారుల మాటలు నమ్మి కొంతమంది రైతులు తమ మిర్చినిల్వలను తాడేపల్లిగూడెం, గుంటూరు, వరంగల్‌ ప్రాంతాల్లోని ఏసీ గోదాములకు తరలించి నిల్వ చేసుకున్నారు. వారు నిల్వ చేసుకున్న సమయంలో ఉన్న ధర కూడా ప్రస్తుతం లేదు. దీంతో రైతులు మరింత నష్టపోయే పరిస్థితి దాపురించింది. విదేశీ అర్డర్లు రాకపోవడం వలనే మిర్చికి ఈ దుస్థితి దాపురించినట్టు తెలుస్తుంది.

కూలి ఖర్చులు రావడం లేదు

ఈ ఏడాది 15 ఎక రాల్లో మిర్చిసాగు చేయ గా చీడపీడలు వైరస్‌ల కారణంగా దిగుబడి తగ్గింది. ప్రస్తుతం క్వింటా మిర్చి రూ.6 వేల నుంచి రూ.7వేల వరకే ధర పలుకు తుంది. దీంతో కోత కూలి ఖర్చులు కూడా రావడం లేదు. గిట్టుబాటు కాక మిర్చి కోయ కుండానే వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

– మాచర్ల వెంకటేశ్వర్లు, నడిమిగొమ్ముకాలనీ

కోలుకోలేని నష్టం

20 ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశాను. రెండేళ్ల క్రితం ఎకరానికి 30 క్వింటాళ్ల దిగుబడి రాగా నేడు 15 క్వింటాళ్లకు పడిపోయింది. గిట్టుబాటు ధర లభిస్తుందన్న ఆశతో కొంత మిర్చిని ఏసీ గోదాములో నిల్వ చేయగా ఆ ఖర్చులూ రావడం కష్టమే.

– వాసిరెడ్డి జగన్‌, శివకాశీపురం.

Updated Date - May 13 , 2025 | 12:08 AM