ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎన్డీఏ హయాంలోనే అమరావతి అభివృద్ధి

ABN, Publish Date - Apr 30 , 2025 | 12:45 AM

ఎన్డీఏ హయాంలో రాజధాని అమరా వతి అభివృద్ధి చెందుతుందని, మే 2న ప్రధాని నరేంద్రమోదీ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారని రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్‌, కొలుసు పార్థసారథి తెలిపారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రులు నాదెండ్ల మనోహర్‌, కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు

ఎన్డీఏ హయాంలోనే అమరావతి అభివృద్ధి

2న మోదీ సభను విజయవంతం చేయండి : మంత్రుల పిలుపు

ఏలూరు టూటౌన్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): ఎన్డీఏ హయాంలో రాజధాని అమరా వతి అభివృద్ధి చెందుతుందని, మే 2న ప్రధాని నరేంద్రమోదీ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారని రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్‌, కొలుసు పార్థసారథి తెలిపారు. ప్రధాని సభను కూటమి శ్రేణులు విజయవంతం చేయాలని వారు పిలుపుని చ్చారు. స్థానిక రెవెన్యూ భవన్‌లో మంగళ వారం విలేకరుల సమావేశంలో వారు మాట్లా డారు. రాజధాని నిర్మాణానికి రైతులు, ప్రజలు 34 వేల ఎకరాలు నాటి తెలుగుదేశం ప్రభు త్వానికి అప్పగించారన్నారు. అనంతరం అధి కారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూర్ఖం గా రాజధాని అమరావతిని నిర్లక్ష్యం చేసింద న్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ప్రధాని మోదీని రాజధాని పనులు పునఃప్రా రంభించేందుకు రావాలని కోరారన్నారు. మోదీ సభను విజయవంతం చేయడానికి టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు కృషి చేయాలన్నారు. అమరావతి నిర్మాణంతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు.

అంతకుముందు టీడీపీ జిల్లా కార్యాలయం లో కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలతో సమావేశమై కార్యకర్తలకు దిశా, నిర్దేశం చేశా రు. అమరావతి రాజధాని నిర్మాణం రాష్ట్రానికి ఎంత అవసరమో మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు వివరించారు. ప్రధాని విజయ వంతం చేయాలని నేతలు, కార్యకర్తలను ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు చింత మనేని ప్రభాకర్‌, బడేటి చంటి, సొంగా రోషన్‌కుమార్‌, పత్సమట్ల ధర్మరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మే యర్‌ షేక్‌ నూర్జహాన్‌, మాజీ ఎమ్మెల్యే ఘం టా మురళి, ట్రైకార్‌ చైర్మన్‌ బొరగం శ్రీనివాసు లు, దాసరి శ్యాం సుందర్‌ శేషు, దాసరి ఆం జనేయులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రమ్‌ కిశోర్‌, జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కె.గోవిందరావు, ఘంటా ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2025 | 12:45 AM