అన్నదాతలకు అధిక ప్రాధాన్యం : మంత్రి నిమ్మల
ABN, Publish Date - May 11 , 2025 | 12:30 AM
అన్న దాతలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కా రానికి అధిక ప్రాధాన్యతనిచ్చి మురుగు కాలు వల్లో పూడికతీత పనులు, పంటలకు ఎరువులు, పండించిన ధాన్యాన్ని తరలించుకోవడానికి ఉపయోగపడే గ్రావెల్ రోడ్ల నిర్మాణం చేస్తున్నా మని రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల రామానా యుడు అన్నారు.
రూ.3.67 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
యలమంచిలి, మే 10(ఆంధ్రజ్యోతి): అన్న దాతలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కా రానికి అధిక ప్రాధాన్యతనిచ్చి మురుగు కాలు వల్లో పూడికతీత పనులు, పంటలకు ఎరువులు, పండించిన ధాన్యాన్ని తరలించుకోవడానికి ఉపయోగపడే గ్రావెల్ రోడ్ల నిర్మాణం చేస్తున్నా మని రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల రామానా యుడు అన్నారు. ‘మన రైతు.. మన రామానా యుడు’ కార్యక్రమంలో భాగంగా మండలంలోని అడవిపాలెం, మేడపాడు, నేరేడుమిల్లి గ్రామాల్లో రూ.3.67 కోట్ల నిధులతో చేపట్టనున్న డ్రెయిన్ల తవ్వకం పనులు, గ్రావెల్ రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసి నూతనంగా నిర్మించిన మేడపాడు–రావిపాడు రహదారిని శనివారం ఆయన ప్రారంభించి శిలాఫలకాలను ఆవిష్కరించారు. మేడపాడులో ఎక్స్‌కవేటర్‌ను మంత్రి రామానాయుడు స్వయంగా నడిపి కాజ మేజర్ డ్రెయిన్ తవ్వకం పనులను ప్రారంభించి మాట్లాడారు. జగన్ ఇసుక, లిక్కర్, మైనింగ్, విలువైన భూములను దోచుకోగా.. స్థానిక వైసీపీ నాయకులు క్రికెట్ బెట్టింగ్ మాఫియాను నడిపి యువతను లూటీ చేశారని విమర్శించారు. నేటి ప్రభుత్వం రైతులకు మేలుచేసే దేవుడని రైతులే చెబుతున్నారన్నారు. ధాన్యం సొమ్ములను 48 గంటలలోపే రైతుల ఖాతాల్లో జమచేసి ఇది రైతు ప్రభుత్వమని నిరూపించామన్నారు. కార్యక్రమాల్లో మామిడిశెట్టి పెద్దిరాజు, బోనం నాని, వాసురాజు, బొప్పన హరికిషోర్, ఆరుమిల్లి రామశ్రీనివాస్, చల్లా నరేంద్రకుమార్, పెచ్చెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 11 , 2025 | 12:30 AM