అమ్మో.. జగన్!
ABN, Publish Date - Jun 23 , 2025 | 12:20 AM
మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్లు రప్పా.. రప్పా.. నరుకుతామని వైసీపీ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించడం.. దానికి ఆ పార్టీ అధినేత జగన్ మంచిదేగా అంటూ సమర్ధించడంపై మంత్రి నిమ్మల రామానాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.
వైసీపీ తీరుపై నిమ్మల ఆందోళన
ఆ పార్టీ కార్యకర్తల తీవ్ర వ్యాఖ్యలు
నరికేస్తామంటే నాయకుడి సమర్ధింపు
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపు
మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్లు రప్పా.. రప్పా.. నరుకుతామని వైసీపీ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించడం.. దానికి ఆ పార్టీ అధినేత జగన్ మంచిదేగా అంటూ సమర్ధించడంపై మంత్రి నిమ్మల రామానాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది చాలా ప్రమాదకర ధోరణి అని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పిలుపునిచ్చారు. జగన్ ధోరణి చూసి భయం కలిగే పరిస్థితి ఉందన్నారు.
యలమంచిలి, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్లు రప్పా.. రప్పా నరుకుతామని ఫ్లకార్డులు ప్రదర్శించిన వైసీపీ శ్రేణులు, వాటిని సమర్థించిన జగన్ తీరు భయం గొలుపుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. యలమంచిలి మండలంలోని బూరుగుపల్లి, కంచుస్తంభం పాలెం గ్రామాల్లో రూ1.7కోట్ల నిధులతో చేపట్టిన జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన, సీసీ రహదారుల ప్రారంభ కార్యక్రమంలో ఆదివారం ఆయన మాట్లాడారు. జగన్ ఏడాది తర్వాత చనిపోయిన వారి కుటుంబానికి పరామర్శ పేరుతో దండయాత్రలు చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడన్నారు. నరుకుతామన్న వాళ్లను సమర్ధించిన జగన్‌కు ప్రజాస్వామ్యంలో ఉండే హక్కు, మాట్లాడే అర్హత లేవన్నారు. జగన్ ఐదేళ్లపాలనలో అరాచకాలు, కక్షలు, కేసులు, వేధింపులతో విసుగెత్తి ప్రతిపక్షహోదా కూడా లేకుం డా ప్రజలు తీర్పునిచ్చారన్నారు. గోదావరి వరద భయం లేకుండా రూ.8కోట్లతో ఏటిగట్టు పటిష్టం చేసే పనులు చేపట్టామన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వరదవస్తే ఏటిగట్టుకు గండిపడకుండా గ్రామస్తులే కాపాడుకున్నారని గుర్తు చేశారు. పనిచేసే ప్రభుత్వానికి.. పనికిమాలిన ప్రభు త్వానికి తేడా ఇదేనన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎన్డీఏ కూటమి నాయకులు మామిడిశెట్టి పెద్దిరాజు, బోనం నాని, ఆరుమిల్లి రామశ్రీనివాస్, చేగొండి రవిశంకర్, ముచ్చర్ల శ్రీనివాసరావు, మాతా రత్నంరాజు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 23 , 2025 | 12:20 AM