పేదలకు అధికార భాగస్వామ్యం
ABN, Publish Date - Apr 19 , 2025 | 12:35 AM
పేదలకు అధికార భాగస్వామ్యం కల్పిం చడం ద్వారా అభివృద్ధి సాధించడం జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లక్ష్యమ ని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు.
ఇదే జనసేన అధినేత పవన్ లక్ష్యం : మంత్రి కందుల దుర్గేశ్
తాడేపల్లిగూడెం రూరల్ ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): పేదలకు అధికార భాగస్వామ్యం కల్పిం చడం ద్వారా అభివృద్ధి సాధించడం జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లక్ష్యమ ని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నివాసం వద్ద పలువురు వైసీపీ ఎంపీటీలు జనసేన చేరిక సందర్భంగా శుక్రవారం నిర్వహించిన సమావే శంలో ఆయన పాల్గొన్నారు. బయట పార్టీల నుంచి కూటమిలో ఏ పార్టీలో చేర్చుకున్నా అది కూటమి బలో పేతం కోసమేనని స్పష్టం చేశారు. ప్రతీ రైతుకు ధాన్యం విక్రయించిన గంటల వ్యవధిలోనే సొమ్ములు వారి ఖాతాలో జమ కావడం కూట మి ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దం పడుతుంద న్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఐదేళ్ల లో ఎక్కడా రోడ్డువేయలేని స్థితి నుంచి తొమ్మిది నెలల్లో భారీగా రోడ్ల వేసి ప్రజల ఇబ్బందులు సగం తీర్చామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్నామ న్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మ రాజు మాట్లాడుతూ పవన్ కల్యాణ్ విధానాల వల్లే ప్రజలు జనసేనకు ఆకర్షితులవుతున్నారని, కూటమి నాయకులంతా అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నామన్నారు. పెంటపాడు మండల ఎంపీటీసీలు దేవాబత్తుల నాగమణి, తోట నిరీక్ష ణరావు, దెయ్యం శ్రీనివాసరావు, సీహెచ్ శారద, కె.దేవికారాణి, డి.సత్యనారాయణ, బొచ్చెల తాతా రావు, నంద్యాల వెంకన్నబాబుకు ఎమ్మెల్యే బొలి శెట్టి శ్రీనివాస్ సమక్షంలో మంత్రి కందుల దుర్గేశ్, ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు.
చిన్న వెంకన్నను దర్శించుకున్న మంత్రి దుర్గేశ్
ద్వారకాతిరుమల, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామిని పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేశ్ శుక్రవారం దర్శించారు. ఆయనకు ఆలయ ఈవో ఎన్వీ సత్యనారాయణమూ ర్తి, అర్చకులు పూర్ణకుంభ స్వాగ తం పలికారు. మంత్రి ఆలయం లో ప్రదక్షిణల అనంతరం బంగా రువాకిలి గుండా స్వామి, అమ్మ వార్ల మూల విరాట్‌లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనం తరం ఆలయ ముఖ మండపం లో అర్చకులు ఆయనకు స్వామి వారి శేషవస్త్రాన్ని కప్పి వేదాశీర్వచనం పలికారు. అనంత రం ఆలయ ఈవో మూర్తి మంత్రి దుర్గేశ్‌కు స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు.
Updated Date - Apr 19 , 2025 | 12:35 AM