ప్రతీ నియోజకవర్గంలో పారిశ్రామిక పార్కు
ABN, Publish Date - Jul 19 , 2025 | 12:18 AM
ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంస్‌ఎంఈ పార్కులను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు.
తణుకు రూరల్, జూలై 18(ఆంధ్రజ్యోతి): ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంస్‌ఎంఈ పార్కులను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు. తణుకు మండలం వేల్పూరులో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్ర మంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. గ్రామంలోని పలు అభివృద్ది పనులను ప్రారంభించి, వేల్పూరు–మండపాక రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వైసీపీ నాయకులు చంద్రబాబు వయసుపై సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని, తాము జగన్ మోహన్‌రెడ్డి వందేళ్లు జీవించాలని కోరుకుంటున్నామని చెప్పారు. సొంత తల్లి, చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఐదు కోట్ల మందిని ఎలా పరిపాలిస్తాడన్నారు. తణుకు నియోజకవర్గంలో 25 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటుకు కృషి చేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే ఆరిమిల్లి మాట్లాడుతూ భరత్ పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నారన్నారు. సర్పంచ్ వి.కృష్ణవేణి, కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jul 19 , 2025 | 12:18 AM