టీచర్ తప్పులేదు
ABN, Publish Date - Jun 26 , 2025 | 12:47 AM
మండలం లోని గోపన్నపాలెం ప్రాథమిక పాఠశాల విద్యార్థిని ఉపాధ్యాయురాలు కొట్టడం అవాస్తవమని ఎంఈవో ఏవీవీ.ప్రసాద్ అన్నారు.
విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈవో వరప్రసాద్
దెందులూరు, జూన్ 25(ఆంధ్రజ్యోతి): మండలం లోని గోపన్నపాలెం ప్రాథమిక పాఠశాల విద్యార్థిని ఉపాధ్యాయురాలు కొట్టడం అవాస్తవమని ఎంఈవో ఏవీవీ.ప్రసాద్ అన్నారు. గోపన్నపాలెం జిల్లా పరిషత్ అవరణలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి విద్యార్థి వీరంకి విహాన్‌ను టీచర్ కొట్టారనే ఫిర్యాదుతో బుధవారం ఎంఈవో విచారణ నిర్వహిం చారు. చిన్న పిల్లలు ఆడుకుంటూ తోసుకోవడంతో విహాన్(7) కింద పడిపోయాడు. చేతి వేలికి దెబ్బ తగిలిందని, ఉపాధ్యాయురాలు కొట్టలేదని ఎంఈవో వివరించారు. విద్యార్థి తల్లిదండ్రులకు తెలియజేయ డంతో వారు టీచర్‌పై ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నారని ఎంఈవో తెలిపారు.
Updated Date - Jun 26 , 2025 | 12:47 AM