ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నలుగురు టీచర్లకు మెమోల జారీ

ABN, Publish Date - Jul 12 , 2025 | 01:12 AM

ప్రభుత్వ నిబంధనలకు, విద్యార్థుల అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నలుగురు టీచర్లకు జిల్లా విద్యా శాఖ శుక్రవారం మెమోలు జారీచేసింది.

ఏలూరు అర్బన్‌, జూలై 11(ఆంధ్రజ్యోతి):ప్రభుత్వ నిబంధనలకు, విద్యార్థుల అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నలుగురు టీచర్లకు జిల్లా విద్యా శాఖ శుక్రవారం మెమోలు జారీచేసింది. ఏలూరు నగరంలోని మౌలానా అబుల్‌కలాం అజాద్‌ (మాకా) మున్సిపల్‌ ఉర్దూ హైస్కూలు, తూర్పువీధి ఉర్దూ మున్సిపల్‌ హైస్కూలులో విద్యార్థులకు బోధించే మాఽధ్యమాల (మీడియం) విషయంలో కొంతకాలంగా రచ్చ జరుగుతోంది. ఈ వివాదం రాష్ట్రస్థాయికి చేరుకోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు(కాకినాడ ఆర్జేడీ) నాగమణి ఇటీవల ఏలూరు డీఈవో కార్యాలయంలో విచారణ నిర్వహించారు. రచ్చ జరుగు తున్న రెండు పాఠశాలల టీచర్లను పిలిపించి మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనలు, పాఠశాలల పునర్వ్యవస్థీకరణ మార్గదర్శకాల మేరకు ఏర్పడిన ఈ రెండు హైస్కూళ్లలో బోధించే మాధ్యమాల విషయంలో ప్రభుత్వానికే సర్వాధికారాలుం టాయని, ఆ ప్రకారమే విద్యార్థులు కోరుకున్న మాధ్యమంలో పాఠ్యాంశాల బోధన జరిగి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఒక పాఠశాల టీచర్లు తమకు ఉర్దూ లేదా ఇంగ్లీషు మాధ్యమాల్లో బోధించడానికి ఎటువంటి అభ్యంతరం లేదని లిఖితపూర్వకంగా ఆర్జేడీకి తెలపగా, మరో పాఠశాల ఉపాధ్యాయులు మాత్రం తాము ఇంగ్లీషు లేదా తెలుగు మీడియంలలో బోధించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అయితే ఈ అభిప్రాయాలను ఆర్జేడీ వద్ద చెప్పిన టీచర్ల వివరాలు తెలియరాలేదు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి తమ సొంత నిర్ణయం మేరకు మాధ్యమంలో బోధించేందుకే కట్టుబడిన నలుగురు టీచర్లకు జిల్లా విద్యాశాఖ మెమోలు జారీచేసింది. విద్యాశాఖ అనుమతి లేకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే చర్యలు తీసుకుంటామని మెమోల్లో అధికారులు స్పష్టం చేసినట్టు తెలిసింది. కాగా అదే స్కూలులో పనిచేస్తున్న మరో ఇద్దరు టీచర్లు ప్రభుత్వ ఆదేశాల మేరకు బోధించడానికి అభ్యంతరం చెప్పబోమని హామీ ఇచ్చారు. మెమోల జారీని విద్యాశాఖ వర్గాలు శుక్రవారం రాత్రి ధ్రువీకరించాయి.

Updated Date - Jul 12 , 2025 | 01:12 AM