ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పండుగలా మెగా పీటీఎం 2.0

ABN, Publish Date - Jun 29 , 2025 | 12:17 AM

పిల్లల విద్యావికాసం, వారి అభివృద్ధి ప్రధానాం శాలుగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో వచ్చే నెలలో మెగా పేరెంట్‌–టీచర్‌ మీటింగ్‌ (తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశం– పీటీఎం 2.0)ను నిర్వహించడానికి విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.

జూలైలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో నిర్వహణకు ఏర్పాట్లు

ఏలూరు అర్బన్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి) : పిల్లల విద్యావికాసం, వారి అభివృద్ధి ప్రధానాం శాలుగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో వచ్చే నెలలో మెగా పేరెంట్‌–టీచర్‌ మీటింగ్‌ (తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశం– పీటీఎం 2.0)ను నిర్వహించడానికి విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. వాస్తవానికి ఈ సమావేశాన్ని జూలై 5న నిర్వహించాలని తొలుత నిర్ణయిం చినా ఆ రోజున మొహర్రం ఐచ్ఛిక సెలవు కావడంతో మరో రెండు, మూడు రోజుల వ్యవధిలో మెగా పేరెంట్‌–టీచర్‌ మీటింగ్‌ను జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాలల్లో మెగా పీటీఏ 2.0ని జూలై 10న నిర్వహించాలని ఇంటర్‌బోర్డు నిర్ణయిం చింది. ఇదే తేదీని పాఠశాలవిద్యాశాఖ కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. గతేడాది డిసెంబరు 7న నిర్వహించిన పీటీఎంకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 45 వేల పాఠశాలల్లో 25.46 లక్షల మంది తల్లిదండ్రులు పాల్గొనగా, ఈ ఏడాది నిర్వహించనున్న మెగా పీటీఎం 2.0కి అన్ని ప్రైవేటు పాఠశాలలను చేర్చడంతో రెట్టింపు హాజరు ఉంటుందని అంచనా. దీనికనుగుణం గానే మెగా పీటీఎం 2.0ని విజయవంతం చేయడం ద్వారా పాఠశాల నిర్వహణ, విద్యార్థి ప్రవర్తన, సామాజిక అంశాలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్థానిక విద్యావేత్తలు, మేధావులు, సంఘ సేవకు లను సమన్వయం చేసుకుని సత్ఫలితాలు సాధించాలని విద్యాశాఖ భావిస్తోంది.

మినిట్‌ టు మినిట్‌ ప్రోగ్రాం ఇలా..

ఏలూరు జిల్లాలోని 1,609 ప్రభుత్వ, 1,200 ప్రైవేటు పాఠశాలలన్నింటిలో మెగా పీటీఎం 2.0 నిర్వహణకు మార్గదర్శకాలను జారీ చేశారు. వీటితోపాటు 237 జూనియర్‌ కళాశాలల్లో ఈ సమావేశాలు నిర్వహిస్తారు. మొత్తంమీద ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో సుమారు 2.60 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా, పశ్చిమ గోదావరి జిల్లాలో 1.392 ప్రభుత్వ, 375 ప్రైవేటు పాఠశాల లన్నింటిలో, 130 జూనియర్‌ కళాశాలల్లో ఈ సమావేశాలు నిర్వహి స్తారు. 2.69 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆ మేరకు మెగా తల్లిదండ్రులు, టీచర్ల సమావేశంలో పాల్గొనాల్సి ఉంటుంది. ఉదయం 9నుంచి 9.30 గంటల వరకు తల్లిదండ్రులు, విద్యావేత్తలు, పూర్వపు విద్యార్థులు, ఎస్‌ఎంసీ సభ్యులు, ప్రజాప్ర తినిధులు, విద్యాశాఖాధికారులకు ఆహ్వానం పలుకుతూ ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహి స్తారు. హాజరైన వారందరితో కలిపి ఒక్కో విద్యార్థి, పేరెంట్స్‌తో విడివిడిగా ఫొటోలు తీసే కార్యక్రమం, తరగతి గదిలోకి పేరెంట్స్‌ను ఆహ్వా నించి వారిని పిల్లలతో కూర్చోబెడతారు. ఉద యం 9.30 నుంచి 10.30 గంటల వరకు ఒక్కో విద్యార్థి, వారి తల్లిదండ్రులతో క్లాసు టీచరు సమావేశమై హోలిస్టిక్‌ ప్రోగ్రెస్‌ రిపోర్టు అందజేయడం, వారి ప్రగతి, ఆరోగ్యవిషయాలపై చర్చించారు. తల్లికి వందనం, గుడ్‌ టచ్‌– బ్యాడ్‌ టచ్‌, పాజిటివ్‌ పేరెంటింగ్‌, మనబడి మ్యాగ జైన్‌ల గురించి అవగాహనకు క్లాసురూమ్‌లోని టీవీ/ఐఎఫ్‌పీలలో లఘుచిత్రాలను ప్రదర్శిస్తారు. ఉదయం 10.30 నుంచి 20 నిమిషాలపాటు తల్లులకు రంగోలి, మ్యూజికల్‌ చైర్‌, తండ్రులకు టగ్‌ ఆఫ్‌ వార్‌ పోటీలను నిర్వహిస్తారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.35 గంటల వరకు ప్రధాన వేదికపైకి అందరినీ ఆహ్వానించి స్వాగతగేయాలాపన తర్వాత తల్లుల ను వేదికపైకి పిలిచి, వారి పిల్లలు పుష్పాలతో పాదాభివందం చేసేందుకు తల్లికి వందనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. స్కూలు టాపర్లు ఇద్దరితో ప్రసంగాలు, పూర్వపు విద్యార్థులతో ఉపన్యాసాలు, ముఖ్యఅతిథి ప్రసంగం ఉంటా యి. చివరిగా ప్రతిజ్ఞతో కార్యక్రమాన్ని ముగించి, అందరూ సహపంక్తి భోజనం చేస్తారు.

పండుగ వాతావరణంలో పీటీఎం

పీటీఎంలో భాగంగా విద్యార్థికి సంబం ధించిన విద్యాప్రగతి, సామర్థ్యాలను తెలిపే హోలిస్టిక్‌ ప్రోగ్రెస్‌ కార్డులను తల్లిదండ్రులకు టీచర్లు అందజేసి, ఏయే విషయాల్లో వెనుకబాటు ఉందో గుర్తించి, వాటిని అధిగమిం చడానికి ఎలా ప్రోత్సహించాలో సూచనలు చేస్తారు. స్కూలు హెచ్‌ఎం నేతృత్వంలో విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించి పాఠశాలలో విద్యాసంబంధిత ప్రగతి, మౌలిక సదుపాయాల ఆవశ్యకత, కార్యాచరణ ప్రణాళికలను తల్లిదండ్రులకు వివరిస్తారు. పేరెంట్స్‌కు ఆటపాటలతో కూడిన వినోదాత్మక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. విద్యార్థు లందరికీ రాష్ట్రీయ బాలసురక్ష కార్యక్రమం (ఆర్బీఎస్కే)కింద ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, వాటి వివరాలను హెల్త్‌ బుక్‌లెట్లలో నమోదు చేసి, రాగల ఐదేళ్లపాటు విద్యార్థి ఆరోగ్య విషయాలను ట్రాక్‌ చేస్తారు. విద్యార్థి కుటంబసభ్యులతో గ్రూప్‌ ఫొటోలు, మొక్కలు నాటడం వంటివి చేపడతారు.

Updated Date - Jun 29 , 2025 | 12:17 AM