రూ.12 వేల జీతానికి పనిచేశా..
ABN, Publish Date - Jul 15 , 2025 | 12:40 AM
మధ్యతరగతి కుటుం బం నుంచి వచ్చిన తాను సివిల్ ఇంజనీరింగ్ చదివి చిన్న కంపెనీలో రూ.12వేలు జీతంతో పనిచేశానని ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ యువతకు వివరించారు.
మెగా జాబ్‌మేళాలో ఎంపీ మహేశ్
పెదపాడు, జూలై 14(ఆంధ్రజ్యోతి): మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన తాను సివిల్ ఇంజనీరింగ్ చదివి చిన్న కంపెనీలో రూ.12వేలు జీతంతో పనిచేశానని ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ యువతకు వివరించారు. ఆ అనుభవంతో ఐదు కంపెనీలు గ్రూప్‌గా ఏర్పడి రూ.4వేల కోట్ల టర్నోవర్‌తో వ్యాపారాన్ని విస్తరించినట్లు తెలిపారు. వట్లూరు సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం మెగా జాబ్‌మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వంలో పరిశ్ర మలు, పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయారని, కూటమి ప్రభుత్వంలో తిరిగి వస్తున్నారని ఎంపీ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు విద్య, ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పనపై దృష్టి పెట్టినట్లు ఎంపీ తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నేరవేర్చుకుంటూ వస్తున్నామన్నారు. కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ యువతీయువకులకు ఉద్యో గావకాశాలు కల్పన లక్ష్యంగా జిల్లాలో 42 జాబ్ మేళాలు నిర్వహించి 2500 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. మొద టగా వచ్చిన ఉద్యోగం జీవితానికి తొలిమెట్టు భావించి మంచి అనుభవం పొంది భవిష్యత్‌లో ఉన్నత స్థానాలకు చేరాలన్నా రు. ఎస్పీ కేపీఎస్ కిశోర్ మాట్లాడుతూ ఉద్యోగావకాశాలకు పోటీ తీవ్రంగా ఉందని, ఉద్యోగ మేళా ద్వారా అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, బడేటి చంటి, చిర్రి బాలరాజు, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 15 , 2025 | 12:40 AM